end

చిరకాల స్వప్నం నెరవేరింది

  • అంతిరెడ్డి గూడ గ్రామ పంచాయతీ భవనంప్రారంభోత్సవం
  • ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

నందిగామ: మండల పరిధిలోగల అంతిరెడ్డి గూడ గ్రామపంచాయతీ భవనం వైభవంగా ప్రారంభోత్సమైంది. ఇటీవలే గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఆమోదం పొందడంతో నందిగామ డిప్యూటీ సర్పంచ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన అంతిరెడ్డి గూడ గ్రామపంచాయతీ భవనాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవానికి ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ విచ్చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో ఏళ్ల కల నెరవేరిందన్నారు. ఈ ఆనందోత్సవ వేళ అంతిరెడ్డి గూడ గ్రామస్తులు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రియాంక శివ శంకర్ గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల తులసి రామ్ నాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, ఎంపిడిఓ బాల్ రెడ్డి, ఎంఆర్ఓ ఆర్ వెంకటలక్ష్మి, సెక్రెటరీ రాజు, ఎంపిటీసిలు దేపల్లి కుమార్ గౌడ్, చంద్ర పాల్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రాజగోపాల్, సింగల్ విండో వైస్ చైర్మన్ రజినీకాంత్, డైరెక్టర్లు రాంబాబు, సురేష్, వార్డు మెంబర్లు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

Exit mobile version