end

రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు..

పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పును తీసుకువచ్చింది. ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే దురదృష్టావశాత్తు మరణిస్తే.. వారిపై సానుభూతి కలిగి, విపక్షాలు సైతం పోటీలో నిలబడలేని పరిస్థితి ఒకప్పుడు. కానీ ఇప్పుడు సానుభూతి కోణాన్ని మార్చేసి మరీ రాజకీయ పక్షాలు సవాలుకు సై అంటున్నాయి. దుబ్బాకలో అధికార పార్టీ ఎమ్మెల్యే మరణంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానంలో బీజేపీ పాగా వేయడం మామూలు విషయం కాదు.

‘లాక్‌డౌన్‌’.. వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌

తెలంగాణలో ఉన్న అతి పెద్ద పార్టీ టీఆర్ఎస్‌. ఆ పార్టీకి ప్రత్యామ్నయమౌతుందనుకున్న కాంగ్రెస్‌ పూర్తిగా చతికిలపడింది. దీంతో, కాంగ్రెస్ వీక్‌నెస్‌ను బీజేపీ క్యాష్‌ చేసుకుంది. వారి ఓట్లన్నీ తమ వైపుకు తిప్పుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయామని మరీ తేల్చి చెప్పింది. ఈ ఉప ఎన్నిక. క్రితం సారి జరిగిన ఎంపీ ఎలక్షన్లలోనూ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది.

అధికార పార్టీకి షాకిచ్చి అప్రమత్తం చేసిన హోరాహోరీ పోరు ఇదని చెప్పవచ్చు. దుబ్బాక ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అనేక చర్చలకు దారితీస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌కు షాకివ్వడమే కాక, ఈ ఎన్నిక రాష్ట్ర భవిష్యత్‌ రాజకీయ ముఖచిత్రానికి సంబంధించిన అనేక సంకేతాలను వెలుగులోకి తెచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అల్లంతో ఎన్ని ప్రయోజనాలో..

అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా ఎదుర్కొన్న ఈ ఎన్నికలో అంతిమ విజేత ఎవరైనా మూడు పార్టీల భవిష్యత్తును నిర్దేశించేలా దుబ్బాక ప్రజలు తీర్పునిచ్చారని, మూడు పార్టీలనూ ఆలోచనలో పడేసేలా ఫలితం వచ్చిందని రాజకీయ వర్గాలంటున్నాయి. సానుభూతి కోణంలోనే పోరాడిన మూడు పక్షాల హోరాహోరీ పోరు రాజకీయ పక్షాలకు సవాల్‌ విసిరేలా, ప్రచారంలో దూకుడు, భావోద్వేగాలకు వేదికగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

బీజేపీలో ఊపు మొదలైందా..
అనూహ్య విజయం సాధించిన బీజేపీకి ఈ ఫలితం మంచి బూస్టిచ్చిందని చెప్పకతప్పదు. కేంద్రంలో అధికారం ఉండడంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలనే కమలనాథుల ఆకాంక్ష నెరవేర్చేందుకు దుబ్బాక ఎన్నిక బాటలు వేసిందని రాజకీయ వర్గాలంటున్నాయి. జాతీయ పార్టీగా రాష్ట్రంపై పట్టు సాధించాలనే ఆరాటంతో కొంత దూకుడుగానే పోతున్న బీజేపీ నేతలకు దుబ్బాక ఫలితం కిక్కునిచ్చిప్పటికీ.. అసలు పోరు ముందుంది.

బెల్లీఫ్యాట్‌తో బాధపడుతున్నారా..?

ఇంకా చాలా కష్టపడితేనే కమలనాథుల ఆశలు నెరవేరుతాయని విశ్లేషకులంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20– 30 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ మోస్తరు ఓట్లు సాధించే పరిస్థితి లేదనీ.. గత ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తెరిగి పార్టీ నడుచుకోవాలని విశ్లేషకుల మాట.

అప్రమత్తమైన టీఆర్‌ఎస్..
గత ఆరేళ్లుగా జరిగిన ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించిన అధికార టీఆర్‌ఎస్‌కు ఈ ఓటమి మేల్కొలుపు వంటిదని రాజకీయ వర్గాలంటున్నాయి. పాజిటివ్‌ స్పందన ఒక్కసారిగా నెగెటివ్‌గా మారగానే కలిగే రాజకీయ ప్రకంపనలు సహజంగానే అధికార పార్టీకి ఆందోళన కలిగిస్తాయని, అయితే ప్రజాసంక్షేమంపై మరింత చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరాన్ని దుబ్బాక ప్రజలు టీఆర్‌ఎస్‌కు గుర్తు చేశారని విశ్లేషకులంటున్నారు.

Exit mobile version