end
=
Saturday, January 18, 2025
వార్తలుఅంతర్జాతీయంCorona:ఆ ఆరు దేశాల ప్రయాణికులకు నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి
- Advertisment -

Corona:ఆ ఆరు దేశాల ప్రయాణికులకు నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి

- Advertisment -
- Advertisment -

  • భారత్‌కు విస్తరించకుండా పలు చర్యలు తీసుకుంటున్న కేంద్రం

Covid-19 guidance; మరోసారి విజృంభిస్తున్న కరోనా సంక్షోభం (Corona crisis) భారత్‌కు విస్తరించకుండా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. చైనా (china)సహా మరో ఐదు దేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్-19 మార్గదర్శకాల్లో (Covid-19 guidance) మార్పులు చేసింది భారత్ (India). నేరుగా వచ్చే వారితో పాటు వేరే ప్రాంతాల నుంచి వయా ఆ దేశాల గుండా వచ్చే వారికి కూడా ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి (RT-PCR negative report is mandatory) అని చెప్పింది. కొన్ని దేశాల్లో కొవిడ్-19 వ్యాప్తి అధికంగా ఉండటంతో భారత ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా వేరే దేశాల నుంచి వచ్చే వారి వల్ల ఇక్కడ వైరస్ వ్యాప్తి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది.

చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‍ల్యాండ్ (China, Hong Kong, Japan, South Korea, Singapore, Thailand) దేశాల నుంచే వచ్చే వారు.. ఇండియాలో అడుగుపెట్టకముందే ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికేట్‍ను సమర్పించడం కచ్చితం చేసింది. ఇంత వరకు ఈ దేశాల నుంచి నేరుగా వచ్చే వారికే ఈ నిబంధన ఉంది. అయితే కొత్త మార్పుల ప్రకారం, వేరే చోట్ల నుంచి ఆ దేశాల మీదుగా వచ్చే వారికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ఆ ఆరు దేశాల నుంచి వచ్చే వారు ఇక తప్పకుండా ఎయిర్ సువిధ (Air Suvidha) పోర్టల్‍లో ఆర్టీ-పీసీఆర్ సెట్ నెగెటివ్ రిపోర్టును అప్‍లోడ్ (Upload the RT-PCR set negative report in the portal) చేసిన తర్వాత బయలుదేరాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా.. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న హైరిస్క్ దేశాల(High Risk) మీదుగా ఇండియాకు వచ్చే వారికి ఆర్‌టీపీసీఆర్(RTPCR) నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేసింది. చైనాతో పాటూ దక్షిణ కొరియా, జపాన్, థాయ్‌ల్యాండ్, హాంకాంగ్, సింగపూర్ దేశాల మీదుగా వచ్చే ప్రయాణికులకు ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణికులు (International travelers) తమ ప్రయాణ తేదీకి మునుపు 72 గంటల్లో తీయించుకున్న రిపోర్టును మాత్రమే అధికారులు అనుమతిస్తారు. గతంలో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఆర్‌టీపీసీఆర్ తప్పనిసరి చేయగా.. ప్రస్తుతం ఆ దేశాల మీదుగా వచ్చే వారికీ ఈ నిబంధన వర్తింపజేసింది.

ప్రస్తుతం దేశంలో రోజు వారి కరోనా కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ.. అధికార వర్గాలు అప్రమత్తత పాటిస్తున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా (Christmas and New Year celebrations) ప్రజలు మాస్కు (Mask)లు లేకుండా గుమిగూడకుండా చూడాలంటూ రాష్ట్రాలకు కేంద్రం ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. ఇక ఆక్సిజన్ (oxigen) నిల్వలు తగినంత ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. గత నెలలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మాట్లాడుతూ..కొవిడ్-19 ఇంకా ముగిసిపోలేదని వ్యాఖ్యానించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తన మన్‌ కీ బాత్ కార్యక్రమంలోనూ హెచ్చరించారు.

చైనాతో పాటు మరో ఐదు దేశాల మీదుగా భారత్‍కు రావాలనుకుంటున్న వారు బయలుదేరే ముందు 72 గంటల వ్యవధిలోనే ఆర్‌-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. ఆ టెస్టులో నెగెటివ్ వస్తే.. బయలుదేరే ముందే ఎయిర్ సువిధ (Air Suvidha) పోర్టల్‍లో అప్‍లోడ్ చేసి.. అనుమతి పొందాలి. ఆ తర్వాత మాత్రమే ఇండియాకు వచ్చే అవకాశం ఉంటుంది. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సూచనలు జారీ చేసింది. నేరుగా ఆ దేశాల నుంచి రావాలన్నా ఈ ప్రక్రియ తప్పనిసరి.చైనాలో ఒమిక్రాన్ బీఎఫ్ 7 (omicron bf 7) వేరియంట్ విజృంభణతో కొవిడ్-19 కేసులో కోట్లలో నమోదవుతున్నాయి. మరణాలు కూడా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. క్రమంగా జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‍లాండ్‍లోనూ కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‍లో మరో వేవ్‍కు అవకాశం రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. మరోవైపు, ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ (Omicron BF7 variant)ఇండియాలో వ్యాప్తి చెందకపోవచ్చని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. భారతీయుల్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని, మరో వేవ్‍‍కు అవకాశం ఉండబోదనేలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు లేకపోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు.

(Samantha:ఆ వెబ్‌సిరీస్ నుంచి త‌ప్పుకున్న స‌మంత!)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -