end

Harish rao : పారిశ్రామిక వాడకు కొత్త శోభ

Industrial park | సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు నియోజకవర్గంలోని పాశమైలారం పారిశ్రామికవాడ నుంచి కర్ధనూరు ఔటర్ రింగ్(outer ring road) రోడ్డు జంక్షన్ వరకు రూ. 121 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలుగు వరుసల బీటీ రహదారి నిర్మాణ పనులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు(Minister Harishrao), మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి శంస్థాపన చేశారు.

అనంతరం మండలంలోని రుద్రారం సిద్ధి గణపతి (siddi vinyaka temple) దేవాలయ ఆవరణలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు రాజగోపురాలు, నిత్యా అన్నదాన సత్రం, కల్యాణ మంటపం, 24 దుకాణాల సముదాయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Exit mobile version