ప్రియుడి మోజులో పడి ఓ మహిళ భర్త హత్యకు పథకం(Murder Plan) రచించింది. రోడ్డుపై అనామకంగా వెళ్తున్న భర్తను కారుతో గుద్దించి(Hit and Run) చంపేయాలనుకున్నది. అనుకున్నట్లుగానే ప్లాన్ అమలు చేసింది. ప్రమాదంలో భర్త గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. అంతజరిగినా తనకేమీ తెలియనట్లుగానే ఉంది. చివరకి బండారం ఎలా బయటపడిదంటే.. మధ్యప్రదేశ్(Madhya pradesh)లోని గ్వాలియర్ పట్టణానికి చెందిన అనిల్‌పాల్ కిరాణ దుకాణం నడుపుతున్నాడు. అతడికి 2016లో రజనీ అనే మహిళతో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం.. కొంతకాలం నుంచి రజనీ పుట్టింటికి వెళ్తున్నానని భర్తకు చెప్పి ప్రియుడు మంగళ్ సింగ్ కుష్వాతో టూర్‌కు వెళ్లేది.
విషయం తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. దీంతో ఎలాగైనా భర్తను వదలించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది. కొందరికి సుపారీ(Supari) ఇచ్చి తన భర్తను కారుతో గుద్ది హతమార్చాలని సూచించింది. మార్చి 20న రంగంలోకి దిగిన దుండగులు అనిల్‌పాల్ గ్వాలియర్‌లోని ఝాన్సీ మార్గంలో నడుచుకుంటూ వెళ్తుండగా కారుతో బలంగా ఢీకొట్టారు. సుమారు 50 మీటర్ల వరకు అనిల్‌పాల్‌ను ఈడ్చుకెళ్లారు. ఘటనలో అనిల్‌పాల్ తీవ్రగాయాలపాలయ్యాడు. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడి నుంచి
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రంగంలోకి దిగి ఝాన్సీ మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీ(CC Camera footage)లన్నింటినీ పరిశీలించారు. కారు నంబర్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. పోలీసులు తాజాగా రజనితో పాటు ఆమె ప్రియుడు మంగళ్ సింగ్ కుష్వాను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.