end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Abrus Precatorius:విషం చిమ్ముతున్న మొక్క
- Advertisment -

Abrus Precatorius:విషం చిమ్ముతున్న మొక్క

- Advertisment -
- Advertisment -

  • ప్రమాదకరంగా ‘అబ్రస్ ప్రికాటోరియస్’
  • దగ్గరికి వెళితే ప్రాణం పోయినట్లే


‘అబ్రస్ ప్రికాటోరియస్’ (‘Abrus Precatorius’) మొక్క (Plant).. వైపర్ పాము విషంతో సమానమైన టాక్సిన్‌ (Toxin)ను రిలీజ్ చేస్తుంది. ఇండియాలో ‘రట్టి’ లేదా ‘గుంచీ’ అని పిలువబడే ప్లాంట్.. విత్తనాల ద్వారా ‘అబ్రిన్’ (Abrin)అనే విషాన్ని చిమ్ముతుంది. చెట్టును ముట్టుకోవడం ద్వారా శరీరంలోని కణాల్లోకి ప్రవేశంచిన పాయిజన్ (poison) కణాలకు అవసరమైన ప్రోటీన్‌ (Protein)ను తయారు చేయకుండా నిరోధించి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ మధ్య న్యూ ఢిల్లీలో (Delhi)ఇలాంటి కేసు ఒకటి నమోదు కాగా మొక్కతో కాంటాక్ట్‌లోకి వచ్చాక ఏం జరుగుతుంది? ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

రట్టి మొక్కను ముట్టుకోవడం వల్ల రక్త విరేచనాలు, మతి మరుపు, మూర్ఛ, మెదడు వాపు, (Diarrhea, dizziness, fainting, encephalitis,) షాక్‌తో కూడిన అధిక పల్స్ రేట్ (pulse rate)వంటి లక్షణాలను అనుభవిస్తారు. ఈ రకమైన విషప్రయోగంలో రెండు గంటలలోపు కడుపును పూర్తిగా శుభ్రపరిచి, కోల్ ట్రీట్మెంట్ అందించడం ఆదర్శవంతమైన చికిత్సగా నిపుణులు తెలిపారు. అబ్రిన్‌కు విరుగుడు లేనందున.. అబ్రిన్ ఎక్స్‌పోజర్‌ను నివారించడం చాలా ముఖ్యమైన అంశం. ఒకవేళ ఎక్స్‌పోజర్‌ (exposer)ను నివారించలేకపోతే.. వెంటనే అబ్రిన్‌ను శరీరం నుంచి వీలైనంత త్వరగా బయటకు తీయాలి. ఇక ఈ మొక్క ప్రాంతంలో శ్వాస తీసుకోవడం, విత్తనాలు మింగడం, చర్మం (skin)లేదా కంటికి (eyes)బహిర్గతం కావడం ఆధారంగా వైద్యం చేయబడుతుంది.

(Harish Rao:బీజేపీ బ్లాక్‌ మెయిల్ రాజకీయాలకు భయపడం)

కాగా తాజాగా మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) భింద్‌(bindu)కు చెందిన ఆర్‌కే (RK) అనే ఏడేళ్ల బాలుడు అక్టోబరు 31న ప్రాణాపాయ స్థితిలో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి (Sir Ganga Ram Hospital, Delhi)లో చేరాడు. 24 గంటల తర్వాత పిల్లాడిని అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకురాగా.. ఖచ్చితమైన విరుగుడు అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్‌ (Golden hour) ను కోల్పోయినట్లు తెలిపారు వైద్యులు. ‘విషంప్రభావాలను తగ్గించడానికి బాధితుడికి సహాయక వైద్య సంరక్షణ అందించడం ద్వారా అబ్రిన్ విషప్రయోగం చికిత్స చేయబడుతుంది. మేము అదే చేసాం. నాలుగు రోజుల తర్వాత పిల్లవాడు రక్షించబడ్డాడు. స్థిరమైన స్థితిలో డిశ్చార్జ్ అయ్యాడు’ అని డాక్టర్స్ (doctors) తెలిపారు. ఇక అంతకు ముందు ఓ వ్యక్తి ఐదు విత్తనాలను తీసుకోవడం మూలంగా.. మూర్ఛ వచ్చి కోమాలోకి వెళ్లాడని, పరిస్థితి తీవ్రమై 24 గంటల్లో మరిణించినట్లు వివరించారు వైద్యులు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -