end

Humanity:మానవత్వం చాటిన మహిళ కానిస్టేబుల్!!!

ప్రజలు మాకు అందుకు లే అని మనవత్వం(Humanity) మరచిపోయి బ్రతుకుతున్న రోజులువి. అలాంటి పరిస్థితి లో తమిళనాడులోని వెల్లూరులో అద్బుతమైన సంఘటన జరిగింది. ఆడవారికి ప్రసవం ఒక పునర్జన్మ(Reincarnation) లాంటిది అని అందరూ కదా అది ఇప్పుడు నిజం అని మరోసారి నిరూపించారు ఒక పోలీసు కానిస్టేబుల్ (Police Constable). ఆదివారం రాత్రి వెల్లూరు అన్నాసాలైలోని సౌత్ పోలీస్ స్టేషన్‌కు అటాచ్‌డ్‌గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఇళవరసి నైట్ డ్యూటీకి వెళ్లారు. అదే సమయానికి నడిరోడ్డుపై అర్ధరాత్రి సమయంలో పురిటి నొప్పులతో ఓ యాచకురాలు బాదపడుతుంది. ఆ ఏడుపు విని ఆమె ని గమనించి డాక్టర్ గా మారి ఆమెకు ప్రసవం చేసింది. దాంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ చేతుల్లో పసిబిడ్డ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయిపోయింది.

వివరాల్లోకి వెళ్తే షబానాను ఆమె భర్త వదిలేశాడు. షబానాకు ఇప్పటికే పదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇద్దరు కలసి బస్టాండ్‌లో భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి(Pregnant) కాగా ఆస్పత్రికి వెళ్లడానికి కూడా ఆమె దగ్గర సరిపడా డబ్బులేదు. అటువంటి సమయంలో ఇళవరసి ఆమె పాలిట డాక్టర్‌గా మారి.. ప్రసవం అయ్యేలా చేసింది. ఆ తర్వాత ఇళవలసి ఆస్పత్రికి వెళ్లి షబానాను కలిసింది. “నేను వెళ్లి ఆమెను ఆస్పత్రిలో కలిశాను. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నన్ను కలవమని ఆమెకు చెప్పాను. తర్వాత మేము ఆమె కోసం ఓ ఇల్లు చూస్తాం.” అని ఇళవరసి చెప్పారు. ఆమెకి ఇళవరసి ఒక సంరక్షకురాలిగా మారారు.

Exit mobile version