end
=
Monday, January 20, 2025
సినీమాసమంతకు అరుదైన గౌరవం...
- Advertisment -

సమంతకు అరుదైన గౌరవం…

- Advertisment -
- Advertisment -

సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత క్రేజ్ పెరుగుతూ వెళ్తోంది. విడాకులకు ముందే చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది. ఇక ఆ సిరీస్ తర్వాత విడాకుల ప్రకటించిన సమంతా చాలా కాలం పాటు ఆ కారణంగా వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత పుష్ప సినిమాలో ఆమె చేసిన బోల్డ్ ఐటమ్ సాంగ్ తో మరోసారి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సమంత ఇప్పటికే తెలుగులో శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేయగా యశోద సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయి పోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ మాత్రం జరుగుతోంది. అయితే ఒకపక్క సినిమాలతో మరోపక్క తన సోషల్ మీడియా అకౌంట్స్ తో బిజీ బిజీగా ఉండే సమంత తాజాగా ఒక అరుదైన గౌరవం అందుకున్నట్లు సమాచారం. అదేమిటంటే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరిగే ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని సమంతకు ఆహ్వానం అందింది.

ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నుంచి ఈ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభం కాబోతోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ ఫెస్టివల్ దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి జరుగుతున్న నేపధ్యంలో దానికి సమంతకు ఆహ్వానం అందడం చాలా విశేషం. ఇక ఈ ఫెస్టివల్ లో సమంత తన జీవితానికి కెరియర్ కు సంబంధించిన అనేక విషయాలు పంచుకోబోతున్నారని సమాచారం. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ గతంలో ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లలో భాగమయ్యానని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు అదే ఫిలిం ఫెస్టివల్ కి భారతీయ సినిమా ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొనడం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్న సమంత భారతీయ సినిమాలను, భారతీయులను, సినీ ప్రేమికులను ఇలా అందరినీ ఒకే చోట చేర్చడం ఒక మంచి అనుభూతి అని చెప్పారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ క్యాపిటల్ అయిన మెల్బోర్న్ లో సమంత సినీ ప్రియులను కలవబోతోందట.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -