end
=
Monday, January 20, 2025
సినీమాసుశాంత్‌కు అరుదైన గౌరవం
- Advertisment -

సుశాంత్‌కు అరుదైన గౌరవం

- Advertisment -
- Advertisment -

న్యూఢిల్లీ: ఇటీవల మరణించిన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు ఇకపై ఢిల్లీ ప్రజల నోళ్లలో నిత్యం నాననుంది. దక్షిణ ఢిల్లీలోని ఆండ్రూస్‌ గంజ్‌లో ఉన్న స్ట్రెచ్ రోడ్డుకు అతడి పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు మున్సిపల్ అధికారులు గురువారం ఆమోదం తెలిపారు. ఇక పేరు పెట్టడమే తరువాయి. ఈ రోడ్డుకు నటుడు సుశాంత్ సింగ్ పేరు పెట్టాలని సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) కాంగ్రెస్ కౌన్సిలర్ అభిషేక్ దత్ గతేడాది సెప్టెంబరులో ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలోని రోడ్డు నంబరు 8లో బీహార్‌కు చెందిన వారు నివసిస్తున్నారని, ఆండ్రూస్ గంజ్ నుంచి ఇందిరా క్యాంపునకు దారితీసే రోడ్డుకు ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మార్గ్’గా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తున్నారని దత్ ఆ ప్రతిపాదనలో పేర్కొన్నారు.

బుధవారం జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఎస్‌డీఎంసీ ఆమోదించినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీజేపీ సారథ్యంలోని ఎస్‌డీఎంసీ ఈ ప్రతిపాదనను రీనేమింగ్(పేరు మార్పు) కమిటీకి పంపించగా, నేడు(గురువారం) గ్రీన్ సిగ్నల్ లభించింది. కాగా, సుశాంత్‌కు నేటితో 35 ఏళ్లు నిండాయి. గతేడాది జూన్ 14న ముంబై, బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ విగతజీవిగా కనిపించాడు. అతడి బర్త్ డే సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా సుశాంత్‌ను గుర్తు చేసుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -