చాలా మందికి అందం అంటే గుర్తొచ్చేది స్త్రీలే. ఎందుకంటే వారు అందం అంటే ఆడవారు, ఆడవారు అంటే అందం. వారి వస్త్రధారణ(Attire)పై పెట్టినంత శ్రద్ధ పురుషులకు ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పచ్చు. వారు రెగ్యులర్ గా ఫేస్ ప్యాక్ (Face Pack) మరియు వంటింటి చిట్కాలను ఎన్నొ పాటిస్తూ ఉంటారు. కానీ పురుషులు వారి స్కిన్ గురించి పట్టించుకోరు. అయితే మగవారు కూడా అమ్మాయిల లాగా తమ చర్మం(Skin)పై కొంచం అయిన కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా చర్మ సంరక్షణ కోసం రెగ్యులర్ గా మాయిశ్చరైజింగ్, టోనింగ్ వంటి వాటిని వాడాలి. ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో ఎక్కువ కాలుష్య ప్రభావం వల్ల దుమ్ము, ధూళి వంటివి మన ముఖం మీద పడుతుంటాయి. ఇటువంటి పరిస్థితిలో ఇంటికి వచ్చిన వెంటనే చల్లని నీటితో ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించాలి. ఇలా ప్రతిరోజూ రెండుసార్లు చేస్తే, మీ చర్మం ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటే అమ్మాయిల కంటే అందంగా మెరిసిపోవాల్సిందే.
అమ్మాయిలైతే.. పార్లర్(parlour) కు వెళ్లో లేకపోతే ఇంట్లోనే రకరకాల ప్రయోగాలు చేసో అందంగా కనిపిస్తుంటారు. కానీ అబ్బాయిలకు పార్లర్లకు వెళ్లేంత ఆసక్తి ఉండదు. మరికొంత మంది అబ్బాయిలైతే.. ఎలా ఉంటే ఏంటి అంటూ ముఖం గురించి పట్టించుకోరు. వాడిన మొహం తోనే పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు వెళ్తారు. కొంతమంది అబ్బాయిలు అయితే ఎటైనా వెళ్లలానుకుంటే తరచుగా షేవింగ్ చేస్తూ ఉంటారు. తరచుగా షేవింగ్(Shaving) చేస్తే స్కిన్ మృధుత్వం(Softness) పోయి చర్మం పొడిబారుతుంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోతే ముఖం వాడిపోతుంది. కాబట్టి ఈ సమస్యలకు దూరంగా ఉండాలి అంటే , హ్యాండ్సమ్ గా మార్చే చిట్కాలను పాటించాలి.
మొటిమలు ఇబ్బంది పెడుతుంటే ఒక స్పూన్ గంధం(sandalwood) పొడిలో చిటికెడు పసుపు, కొన్ని రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ ల చేసుకోవాలి..ఈ మిశ్రమాన్ని మొటిమలపైనే, ముఖం మొత్తానికి రాసుకొని ఒక అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు(Pimples) పోయి నల్ల మచ్చలు పోయి చర్మం కాంతివంతం(Brightness)గా కనిపిస్తుంది.. అలాగే టమాటో మరియు చెక్కరని తీసుకొని టొమాటోని చెక్కరలో అద్ది మృదువుగా ముఖం పైన రాయాలి. పెరుగు మరియు పసుపుని బాగా కలిపి ముఖం కి ఫేస్ పాక్ ల పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద నలుపు పోయి చర్మం కాంతివంతం అవుతుంది. ఈ టిప్స్‌తో పాటు ప్రతి రోజు వాటర్ ఎక్కువగా తాగాలి. 8hrs నిద్ర (Good Sleep) పోవాలి.మద్యపానం, ధూమపానం అలవాట్లను మానుకోవాడం కష్టం కానీ తగ్గించుకోవాలి.పోషకాహరం తీసుకుంటూ రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయాలి. తద్వారా మీ ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది.