end

మీసాలను మేలేసి తిప్పిన మహిళ

మహిళలు ఏ విషయంలో తక్కువ కాదు అని నిరూపించిన మహిళ. విషయం ఏంటి అంటే కేరళకు చెందిన ఓ మహిళ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. ఎందుకు అంటే ఆమె అచ్చం మగాళ్ల లాగా మీసాలను మెలితిప్పి నా ఇష్టం అని పేర్కొంటుంది. మగాళ్లు మాత్రమే తిప్పుతారా..? వాళ్లకేం తక్కువ కానంటూ ఓ మహిళ మీసాలను మేలేసి మరి తిప్పుతోంది. ఆమెను నెటిజన్లు చాలామంది ప్రశంసిస్తుండగా మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె చెప్పిన మాటాలు విని అందరూ సెల్యూట్ చేస్తున్నారు. మహిళల్లో హార్మోన్స్ ఇంబాలన్స్ వల్ల కొంతమంది యువతుల ముఖం మీద, గడ్డం మీద వెంట్రుకలు పెరుగుతాయి. వీటిని అవాంఛిత రోమాలు అని కూడా అంటారు. వాటిని తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీరికి విభిన్నంగా కేరళ మహిళ షైజా తన మూతి మీద పెరిగిన మీసాలను ఎంతో ఇష్టంతో పెంచి మీసాల లాగా మలిచారు.

కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల షైజా తన మీసాల కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారాన్ని కొందరు వ్యతిరేకించగా, మరికొందరు ఆమెకు మద్దతుగా నిలవడంతోపాటు ప్రశంసిస్తున్నారు. దీని గురించి షైజా మాట్లాడుతూ తాను మీసాలను పెంచుకోవాలనుకుంటున్నానని, వాటిని తీసివేయడం ఆమెకి అస్సలు ఇష్టం లేదని స్పష్టం చేసింది. ఈ మీసం ఆమెకి గర్వకారణమని పేర్కొంది. ‘‘మీసం గురించి నన్ను ఎగతాళి చేస్తారు. పురుషులకు మీసాలు ఉంటాయి.మహిళకు మీసాలు ఎందుకు ఉంటాయంటూ ప్రశ్నిస్తారు. నాకు నచ్చింది. నా ఇష్టం నేను మీసం ఉంచుకున్నా. నేనేందుకు మీసం ఉంచుకోకూడదు’’ అని షౌజా అన్నారు.

ప్రపంచం తన గురించి ఏమనుకున్నా తాను ఏ మాత్రం పట్టించుకోనని మీసాలు లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేనని షైజా తెలిపింది. కరోనా సమయంలో కూడా తాను మీసాలను కప్పి ఉంచే మాస్క్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డానని పేర్కొంది. కాగా షైజా గత పదేళ్లలో పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఆరుసార్లు ఆపరేషన్లు జరిగాయని ఆపరేషన్ కోసం వెళ్లిన ప్రతీసారి ఇక వెళ్లాల్సిన అవసరం రాదులే అనుకోని వెళ్ళేదాని అని చెప్పారు.

అయితే షైజా ప్రపంచంలోనే మీసాలు ఉన్న మొదటి మహిళ కాదు చాలా మంది ఉన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం 2016లో బాడీ పాజిటివిటీ ప్రచారకర్త హర్నామ్ కౌర్ గుబురు గడ్డం కలిగిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.

Exit mobile version