- ఏడు నెలల్లో 42 లీటర్ల బ్రెస్ట్ మిల్క్ విరాళం
- కోయంబత్తూరుకు చెందిన 29 ఏళ్ల సింధు
ఈ రోజుల్లో చాలామంది తల్లులు పిల్లలకు పాలివ్వడంలో (Breast milk) సఫర్ అవుతున్నారు. కొంతమంది ఉద్యోగ (J0ob)రిత్యా ఈ సమస్యను ఎదుర్కొంటే మరికొందరూ అనారోగ్యం (Unhealthy)కారణంగా పిల్లలకు సరిపడ పాలివ్వలేకపోతున్నారన్నది నగ్న సత్యం. అయితే తమిళనాడు (Tamil Nadu), కోయంబత్తూరు (koyampattur)కు చెందిన 29 ఏళ్ల మహిళ ఏడు నెలల వ్యవధిలో 42 లీటర్ల (ltrs) బ్రెస్ట్ మిల్క్ దానం చేసి రికార్డు (Record) సృష్టించింది. ఈ కాల వ్యవధిలో ఆమె విరాళమిచ్చిన పాలు 1,400 మంది పిల్లల (Childrens) ఆకలి తీర్చేందుకు ఉపయోగించబడ్డాయి. గృహిణి అయిన టి సింధు మోనిక (T. Sindhu mounika) జులై (July)2021లో రాష్ట్ర ప్రభుత్వ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(Neonatal Intensive Care Unit) ‘NICU’కి పాలను దానం చేయడం ప్రారంభించింది. ఈ మేరకు ఏప్రిల్ (April)2022 నాటికి ఆమె దాదాపు 42,000 మి.లీ. పాలను విరాళంగా అందించింది.
తల్లిపాల కొరతతో బాధపడుతున్న పసిపిల్లల ప్రాణాలను రక్షించేందుకు సింధు చూపిన చొరవను ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (Asian Book of Records) తో పాటు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (Indian Book of Records) గుర్తించింది. ఈ క్రమంలోనే ఆమెకు అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందజేసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (Engineering graduate) అయిన మోనిక తన కుమార్తె పుట్టిన 100వ రోజున తన బ్రెస్ట్ మిల్క్‌ను దానం చేయడం ప్రారంభించినట్లుగా చెప్పింది. ‘నా బిడ్డకు పాలు పట్టడమే కాకుండా ‘అమృతం’ (Amrutham)అనే ఎన్జీవో (NGO)కు చెందిన రూప సెల్వనాయకి (Roopa selvanayaki) సూచనల మేరకు నేను తల్లి పాలను సేకరించడం ప్రారంభించాను’ అని మోనికా వెల్లడించింది. ఈ ఎన్జీవో ప్రతి వారం పాలను సేకరించి కోయంబత్తూరు (Koyam Battoor)లోని తల్లి పాల బ్యాంకు (Milk Bank) కు అందజేస్తుంది. ప్రభుత్వాస్పత్రుల్లో అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువు (Newborn baby)లకు ఫీడింగ్ (Feeding) కోసం సెల్వనాయకి 2020లో ఈ ఇనిషియేటివ్ (Initiative)ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఎన్జీవీలో నమోదు చేసుకున్న మొత్తం 50 మంది మహిళల్లో 30 మంది చురుగ్గా బ్రెస్ట్ మిల్క్‌ను దానం చేస్తున్నారు. ‘తల్లులు మరణించిన లేదా వారు ఆహారం ఇవ్వలేని నవజాత శిశువులకు ఈ డొనేటెడ్ బ్రెస్ట్ మిల్క్ (Donated breast milk)ను అందజేస్తాం. భారతదేశంలో 70 తల్లి పాల బ్యాంకులు మాత్రమే ఉండగా.. అందులో 45 తమిళనాడులోనే ఉన్నాయి. వీటిలో 35 తల్లిపాల బ్యాంకులు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, మిగిలినవి 10 తాలూకా ఆస్పత్రుల్లో ఉన్నాయి’ అని చైల్డ్ హెల్త్ స్టేట్ నోడల్ ఆఫీసర్ (Child Health State Nodal Officer ) డాక్టర్ ఎస్ శ్రీనివాసన్ (Dr S Srinivasan)తెలిపారు.