ప్రభాస్(Prabhas) అంటే తెలియని వారు ఉండరు అనడం లో అతిశయోక్తి లేదు. పాన్ ఇండియా స్టార్ గా ఒక రేంజ్ ని క్రియేట్ చేసుకున్నారు. అలాంటి హీరో సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ ఊహాలని అందుకునేలా ఉండాలి అని కోరుకుంటారు కదా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్(Adipursh) చిత్రం సంక్రాంతికి విడుదలయ్యేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇటీవలే గురువారం రోజు డార్లింగ్ ఆదిపురుష్ సినిమా ని ఏఎంబి సినిమాస్(AMB Cinemas) లో 3డి టీజర్ రిలీజ్(Release) చేసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సినిమా రామాయణ గాధతో తెరకెక్కుతున్నఇతిహాస చిత్రం, ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు అభిమానుల్లో ఉండేవి. కానీ టీజర్ విడుదలయ్యాక అభిమానుల ఆశలన్నీ తలక్రిందులు అయ్యాయి. దర్శకుడు ఓం రౌత్ ఒకటి చేయబోయే ఇంకోటి చేసినట్లు ఉన్నాడని గ్రాఫిక్స్ మాయలో పడి రామాయణాన్ని, ఆ పాత్రలకి సరిగా న్యాయం చేయాలేదు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. టీజర్ లో ఓం రౌత్ పాత్రలని చూసి అభిమానుల జీర్ణించుకోలేక పోతున్నారు.
(Shreya Dhanwanthary: పదేళ్లు నరకం చూశానన్న స్టార్ బ్యూటీ)
రామాయణం(Ramayanam) అంటే మనకి తెలిసిన ఒక గొప్ప ఇతిహాసం. మన ఊహల్లో ఉండే రామాయణానికి టీజర్(Teaser) లో చూసిన దానికి పూర్తి భిన్నంగా ఉండడంతో ఎలా చెత్తగా చేశారు అని ఓం రౌత్ ని దుషిస్తున్నారు. రామాయణానికి ప్రధాన ప్రతినాయకుడు రావణాసురుడు(Ravan) అంటే ఎలా చూపించాలి ఎంత గొప్పగా ఉండాలి.. టీజర్ లో చూపిన ఏ సీన్ కూడా ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. దీనితో ఆదిపురుష్ చిత్ర యూనిట్ డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు రంగంలోకి దిగింది. దిల్ రాజు ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ ఫస్ట్ డే నెగిటివ్ టాక్(Negative talk) రావచ్చు. కానీ దానిని పట్టించుకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదన్నారు. సినిమా చూసిన తర్వాత అసలైన ఆడియన్స్ స్పందన వస్తుంది. కేవలం టీజర్ చూసేసి సినిమాని హిట్ అవుతుందా లేదా అని నిర్ణయం తీసుకోవడం మంచి పద్దతి కాదు అన్నారు.
ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వం(Ponnian Selvam) చిత్రానికి కూడా మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అద్భుతమైన రికార్డ్స్ తో దూసుకుపోతోంది అని దిల్ రాజు అన్నారు. ఆదిపురుష్ టీజర్ బాగోలేదన్న అసహనంతో ఓం రౌత్ ని రూమ్ కి పిలిచి ప్రభాస్ కోప్పడ్డాడని, దర్శకుడికి హీరోకి గొడవ అయిందనే వార్తల్లో నిజం లేదు అని కొట్టిపాడేశారు. డార్లింగ్(Darling) పబ్లిక్ లోకి వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా హుందాగా కనిపిస్తాడు. నవ్వుతూ మాట్లాడతాడు. అలా చూసిన ప్రభాస్ ఏదో ఏమరపాటులో ఓం రౌత్ ని ఇన్ఫార్మల్ గా పిలవడం కొత్తగా అనిపించింది. కాబట్టి ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ పై కోప్పడ్డాడు అనేది నిజం కాదన్నారు.
(Allu Arjun : బర్త్ డే సర్ ప్రైజ్ కి రెండు కోట్లు ఖర్చు)