end
=
Friday, November 22, 2024
వార్తలుCURRENT AFFAIRS: ఉగ్రవాదిగా అబ్దుల్ రెహమాన్ మక్కీ
- Advertisment -

CURRENT AFFAIRS: ఉగ్రవాదిగా అబ్దుల్ రెహమాన్ మక్కీ

- Advertisment -
- Advertisment -

  • అధికారికంగా గుర్తించిన ఐక్యరాజ్య సమితి

జననాల రేటు తగ్గి, వయోవృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తమ జనాభా ఇటీవలి కాలంలో తొలిసారిగా తగ్గినట్లు చైనా (CHINA) ప్రకటించింది. 2021 కంటే 2022 చివరి నాటికి తమ దేశ జనాభా 8.50 లక్షలు తగ్గిందని ఆదేశ నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (National Bureau of Statistics) తెలిపింది. చైనా మొత్తం జనాభా 141.18 కోట్లుగా ఖరారు చేశారు. మొత్తం ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని, 2023 ఏప్రిల్ నాటికి అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ నిలుస్తుందని గతేడాది నవంబర్ 15న ఐక్యరాజ్యసమితి (United Nations) ప్రకటించింది. 1950 తర్వాత తొలిసారిగా 2020లోనే ప్రపంచ జనాభా 1శాతం తగ్గిందని తెలిపింది. ఈ లెక్కన 2050 నాటికి భారత (India population) జనాభా 166.80 కోట్లకు చేరుకోనుందని అప్పటికి చైనా జనాభా 131.70 కోట్లే ఉంటుందని ఐరాస అంచనా వేసింది.

అలాగే లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహమాన్ మక్కీని (Lashkar-e-Taiba Deputy Chief Abdul Rehman Makkini) అంతర్జాతీయ ఉగ్రవాదిగా (international terrorist) గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి (ఐరాస)నిర్ణయం తీసుకుంది. భద్రతా మండలికి చెందిన ఐఎస్ఐఎల్, ఆల్‌ఖైదా (ISIL, Al Qaeda) ఆంక్షల కమిటీ మక్కీని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.భారత్, అమెరికా ఈ మేరకు ప్రతిపాదించగా చైనా అడ్డుపడింది. తాజాగా డ్రాగన్ తన అభిప్రాయాన్ని మార్చుకోవడంతో ఈ నిర్ణయం వెలువడింది. మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంతో అతడికి సంబంధించిన ఆస్తుల స్వాధీనం, ప్రయాణాలు, ఆయుధాల కొనుగోళ్లపై నిషేధం మొదలైనవి అమలులోకి వస్తాయి. ప్రస్తుతం ఐరాస నిషేధిత జాబితాలో పాకిస్థాన్‌ (Pakistan) కు చెందిన లేదా పాకిస్థాన్ తో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదుల సంఖ్య 150కి చేరుకుంది.

(PM Modi:ఫిబ్రవరి 13న హైదరాబాద్‌‌కు మోడీ!)

సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (Secunderabad- Visakhapatnam Vande Bharat Express train) ప్రారంభం. సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. (The Prime Minister started by waving the flag virtually from Delhi) ఇప్పటివరకు 8 వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో 8వ రైలు ప్రారంభమైంది.

8 వందే భారతరైళ్లు ప్రారంభం:
1.2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ- వారణాసి
2.2019 అక్టోబర్ 3న న్యూఢిల్లీ- కాట్రా
3.2022 సెప్టెంబర్ 30న గాంధీనగర్‌- ముంబై
4.2022 అక్టోబరు 13న న్యూఢిల్లీ- అంబ్ అందౌర
5.2022 నవంబర్ 11న చెన్నై- మైసూరు
6.2022 డిసెంబర్ 11న బిలాస్‌పూర్- నాగ్‌పూర్
7.2022 డిసెంబర్ 30న హౌరా- న్యూ జల్పైగురి జంక్షన్(NJP)
8.2022 డిసెంబర్ 15న సికింద్రాబాద్-విశాఖపట్నం.

(Parlament :నూతన పార్లమెంటు భవన చిత్రాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -