end
=
Saturday, February 22, 2025
వార్తలురాష్ట్రీయంAbhijith : 22 ఏళ్లకే గుండెపోటు..
- Advertisment -

Abhijith : 22 ఏళ్లకే గుండెపోటు..

- Advertisment -
- Advertisment -

Abhijith : 22 ఏళ్లకే పెద్ద ఉద్యోగం… నెలకు 5 లక్షల జీతం… అంతోలోనే హఠాన్మరణం.. ఈ హృదయ విదారక సంఘటన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునూతలకు చెందిన కట్టా అభిజిత్‌ (22) కెమికల్‌ ఇంజనీరింగ్‌(Chemical Engineering)లో బిటెక్‌ చేసి సౌదీ అరెమియాకు చెందిన ప్రభుత్వ రంగ చమురు సంస్థ సౌది అరామ్‌కో(Saudi Aramco)లో ఉద్యోగం సాధించాడు. ఆనందం ఎక్కువసేపు నిలవలేకపోయింది. ఆదివారం వారం సాయంత్రం వరకు బాగానే ఉన్న అభిజిత్‌ గుండెపోటు(heart attack)లో హఠాన్మరణం చెందాడు. అభిజిత్‌ వరంగల్‌ నిట్‌(Wrangal NIIT)లో కెమికిల్‌ ఇంజనీరింగ్‌లో బిటెక్‌ చేశాడు.

(chloecherry: 18 ఏళ్లకే కంట్రోల్ తప్పా…)

రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి(Chandra Shekar Reddy) కుమారుడే అభిజిత్‌రెడ్డి. ఆదివారం రాత్రి అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో అభిజిత్‌ ఛాతి నొప్పితో బాధపడుతూ కుప్పకూలిపోయాడు. అలికిడితో తమ్ముడు ఆందోళనతో తల్లిదండ్రులను లేపాడు. ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అభిజిత్‌మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అభిజిత్‌ మరణం పట్ల తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖమంత్రి హరీష్‌రావు(Harish Rao), ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్‌(Etala Rajender), ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Siddipet :విద్య వైద్య క్షేత్రంగా సిద్దిపేట

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -