న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల మరణించిన వారిలో మహిళల కన్నా పురుషులే ఉన్నారని తాజా నివేదికలో వెల్లడైంది. మృతుల్లో డెబ్బై శాతం పురుషులేనని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా మహమ్మారి బారిన పడి బలైన వారిలో 55 శాతం మంది 60 ఏళ్లకు పైబడినవారే ఉన్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేశారు. ఆరు నెలల తర్వాత దేశంలో 17 వేల కన్నా తక్కువ పాజిటివ్ కేసులు, 300 కన్నా తక్కువ మరణాలు సోమవారం నమోదైనట్లు పేర్కొన్నారు. కరోనా పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.02 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.