end

గ్రేటర్‌లో సెంచరీకి పైగా..

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ వందకు పైగా సీట్లను గెలుచుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ధీమా వ్యక్తం చేశారు. తమకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అసలు పోటీయే కాదన్నాడు తలసాని. క్రితం సారి సెంచరీకి ఒక్క కార్పోరేటర్‌ స్థానానికి దూరంలో నిలిచిన తాము.. ఈ సారి ఎలాగైనా సెంచరీకి పైగా కార్పోరేటర్‌ సీట్లు గెలుచుకుంటామన్నారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధే అందుకు నిదర్శనమని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వం, క్షేత్ర స్థాయిలో మంత్రి కేటీఆర్‌ సహా మిగితా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు తీరుస్తున్నారని మంత్రి తలసాని గుర్తు చేశారు.

ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. అలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ చూపిన చొరవ అమోఘమని మంత్రి కొనియాడారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించిన సీఎం.. ఎమ్మెల్యేలను, అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతి ఒక్కరు ప్రజల వద్దకు వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. తద్వారా ప్రభుత్వం.. వరద బాధితులకు కుటుంబానికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. ఇంకా సాయం అందని వారు మీ సేవలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ సూచించారు. అలాగే, కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా సాయమందించిందని మంత్రి తలసాని వెల్లడించారు.

Exit mobile version