మనుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సోమవారం నాడు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి రాజీనామా సమర్పించారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్‌రెడ్డి స్పీకర్‌కు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఈ మేరకు ఆయన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. రాజగోపాల్‌రెడ్డి నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన రాజగోపాల్‌రెడ్డి బీజెపీలో చేరనున్నారు.
