మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ నవంబర్ 20 నుంచి సినిమా రెగ్యులర్ షూట్ జరుపుకోనున్నట్లు సమాచారం. కథానాయకుడు చిరు ఆ రోజు నుంచి షూటింగ్‌లో పాల్గొంటారని ఫిల్మ్ నగర్ టాక్. కరోనా నుంచి కోలుకున్న చిరు.. విరామం లేకుండా షూటింగ్ పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా చిత్రీకరణను త్వరగా పూర్తిచేయాలని చిరంజీవి.. దర్శకుడు శివకు సూచించాడట.
త్వరలోనే ప్రారంభవనున్న షెడ్యూల్ డిసెంబర్ వరకు కొనసాగుతుంది. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మెరువనున్నట్లు టాలీవుడ్ ఇన్‌సైడ్ టాక్. కాగా, ఇదివరకు చిరంజీవి, కాజల్ కలయికలో వచ్చిన ఖైదీ నెం. 150 మూవీ బాక్సాఫీస్ వద్ద చక్కటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.