వివాహవేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై ఏసీసీ కుటుంబ సభ్యులు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం మేడ్చల్ జిల్లా కీసర మండలం యాద్గార్‌పల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవిఎం ప్రసాద్ కుటుంబ సభ్యులు వివాహవేడుక కోసం ప్రకాశం జిల్లా చీరాల వెళ్లారు. తిరిగి వీరంతా హైదరాబాద్ వస్తున్నారు. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏసీపీ సతీమణి శంకరమ్మ, ఆయన సోదరుడి కుమారుడు భాస్కర్ దంపతులు మృతిచెందారు. సోదరుడు బాలకృష్ణకు తీవ్రగాయాలు కాగా ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రమాదం జరగడానికి గల కారణాలు పరీక్షిస్తున్నారు.
- Advertisment -
రోడ్డు ప్రమాదంలో ఏసీపీ కుటుంబ సభ్యులు మృతి
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -