end
=
Thursday, November 21, 2024
వార్తలురాష్ట్రీయంహుస్నాబాద్‌లోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కరోనా అలజడి
- Advertisment -

హుస్నాబాద్‌లోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కరోనా అలజడి

- Advertisment -
- Advertisment -

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విజృభిస్తుంది. కొత్తగా 992 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,132కు పెరిగింది. 227 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో 37 మంది ఐసీయూల్లో, 101 మంది ఆక్సిజన్ బెడ్స్‌పై ఉన్నారు. అయితే కొవిడ్ నుంచి కోలుకొని ఆగస్టు 3న 852 మంది డిశ్చార్జ్ అయ్యారు.

తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలు దాటింది. బుధవారం ఆగస్టు 3న వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 6,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 41,182 నమూనాలను పరీక్షించగా ఇంకా 842 మంది నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. హుస్నాబాద్‌లోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కరోనా అలజడి. పాఠశాలలో 20 మందికి పైగా విద్యార్థులు, సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. మంగళవారం రోజూవారి కేసులు 1000 మార్క్ దాటిన విషయం తెలిసిందే. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికం ఉంటున్నాయి. అయితే, కొవిడ్ కేసులు పెరుగుతున్నా మరణాలు మాత్రం సంభవించకపోవడం ఆనందాయకం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -