తాజాగా మరో ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్ కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన వయసు 70. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు.
అంతేకాకుండా డైరెక్టర్‌గా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తెలుగులో ఆకలి రాజ్యం, కాంచన గంగ, జస్టిస్ చక్రవర్తి, మరోచరిత్ర వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆయన పాత్రకి న్యాయం చేశారు. ఆయన అన్ని భాషల్లో కలిపి వందకుపైగా సినిమాల్లో నటించారు.