ట్రాఫిక్ ర్సూల్‌కు, వాహనచట్టాలకు విరుద్దంగా కారు అద్దాలకు నల్లటి స్ర్కీన్‌ను అతికించరాదని గత రెండు వారాలుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎంతటివారైనా, ఎంత పెద్ద విఐపీ అయినా, సినిమాతారలైనా, రాజకీయ నాయకులైనా సరే ప్రభుత్వం నుండి అనుమతి ఉంటే తప్పా కార్లకు నల్లటి స్ర్కీన్‌ను వాడొద్దని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. దీనిలో భాగంగానే సినీ నటులు అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్‌కు చెందిన కార్లకు ఉన్న నల్లటి స్క్రీన్‌ను జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. అనంతరం చలానాలు కూడా వేశారు.
ఎస్ శ్రీధర్ శనివారం రోడ్ నెంబరు 36లోని నీరూస్ కూడలిలో తనిఖీలు చేపట్టారు. అటుగా వెళ్తున్న సినీ నటులు అల్లు అర్జున్, కల్యాణ్‌రామ్ కారు అద్దాలకు నల్లటి స్క్రీన్‌ను గమనించి ఆపారు. రూ.700 చొప్పును చలాన్ వేశారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు పాటించని 90కి పైగా వాహనాలపై కేసులు నమోదు చేశారు.