‘ నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్స్ నా అకౌంట్‌ను హ్యాక్ చేశారు. నా అకౌంట్ ఓపెన్ చేస్తే .. మీ అకౌంటు లేదని చూపిస్తోంది’ అంటూ టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. అయితే ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కాగా, ఇక సెలబ్రిటీల అకౌంట్స్ హ్యాక్ అవ్వడం అనేది కొత్తేమి కాదు. ఇది వరకు కూడా సెలబ్రిటీల అకౌంట్లు హ్యాక్ అయిపోయాయి.. తాజాగా సింగర్ స్మిత అకౌంట్‌ని హ్యాక్ చేశారు హ్యాకర్లు. అయితే టెక్నికల్ టీమ్ దీన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.