end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఆడబిడ్డలకు వరం..
- Advertisment -

ఆడబిడ్డలకు వరం..

- Advertisment -
- Advertisment -
  • దౌల్తాబాద్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారాక్‌ చెక్కుల పంపిణీ

దుబ్బాక నియోజవర్గంలోని దౌల్తాబాద్ మండలంలో వీఆర్‌ఆర్‌ ఫంక్షన్ హాల్లో మంత్రి హరీశ్‌ రావు ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిలు కలిసి  కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్  చెక్కులను  పంపిణీ చేశారు. మంత్రి, ఎంపీ దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి మృతి నన్ను ఎంతో కలిచివేసిందన్నారు. ఆయన లేకుండా కార్యక్రమంలో పాల్గొనవాల్సి వస్తుందని అనుకోలేదు ఆవేదన వ్యక్తం చేశారు.  

దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర శ్రమ పడిని నాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు.  వారు ఎక్కడున్న వారి ఆత్మకి శాంతి చేకూరాలన్నారు.  అనంతరం వారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గ్రామల్లో నిరుపేద కుటుంబాలు ఆడపిల్లల పెండ్లిలు చేసేందుకు కష్టపడకూడదని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లక్షా 116 రూపాయలు అందజేస్తుందన్నారు. ఈ రోజు 693 మందికి 7కోట్ల రూపాయలు అందచేయడం జరిగిందని తెలిపారు. గ్రామల్లో ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -