end
=
Saturday, February 22, 2025
వార్తలురాష్ట్రీయంఏసీబీ వలలో అడిషనల్‌ కలెక్టర్‌
- Advertisment -

ఏసీబీ వలలో అడిషనల్‌ కలెక్టర్‌

- Advertisment -
- Advertisment -

రూ. కోటి 12లక్షలు తీసుకుంటూ పట్టుబడినమెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌

రెవెన్యూ డిపార్టుమెంట్‌లో రోజుకో అధికారి బాగోతం వెలుగులోకి వస్తుంది. మొన్న రంగారెడ్డి జిల్లా కీసార మండలంలో తహసీల్దార్‌ నాగరాజు రూ. కోటి 10లక్షలు లంచం తీసుకుంటు పట్టు బడగా.. మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రూ. కోటీ 12లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి నేనేం తక్కువ కానని నిరూపించుకున్నారు. ఏసీబీ అధికారుల విచారణలో తహసీల్దార్‌ నాగరాజును కొత్త పేర్లు తెరపైకి తెచ్చాడు. వారిలో మెడ్చేల్‌ కలెక్టర్‌, ఆర్డీవో రవి ఆదేశాల మేరకే లంచం తీసుకున్నాని బాంబు పేల్చిన విషయం విధితమే..

ఆర్‌వోఆర్ స్థానంలో ‘రైట్స్‌’ బిల్లు..?

మెదక్ మండలం మాచవరం గ్రామంలో మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మెదక్‌ మండలం మాచవరంలో ఓ భూ వివాదంకు సంబంధించి రూ. కోటి 12లక్షల డీల్ కుదుర్చుకోగా ముందుగా రూ. 40 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి తన అవినీతి బాగోతాన్ని బయటపెట్టుకున్నారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో మెదక్‌ జిల్లా మాచవరంతో పాటు హైదరాబాద్‌లోని ఆయన ఇండ్లలో ఉ. 6గంటల నుంచి సోదాలు చేపట్టారు. ఏసీబీ సోదాల్లో ఏసీబీ డీఎస్ పి సూర్య నారాయణ,  సీ ఐ లు ఫయాజ్, గంగాధర్, ఎస్ ఐ లు మజీద్ అలీఖాన్, నాగేంద్ర బాబు, రామ లింగారెడ్డి, శంకర్ రెడ్డి,  శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పాలిటెక్నిక్‌ ప్రవేశ షెడ్యూలు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -