- CBSE సిలబస్
- ఇంగ్లిష్ మీడియంలో బోధన
2022-23 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలకుగాను దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ గోపాలకృష్ణ తెలిపారు. 6వ తరగతి నుండి ఇంటర్ వరకు ఈ ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని వివరించారు. అయితే ఈ ఏకలవ్య పాఠశాలల్లో CBSE ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ఉంటుందని తెలిపారు. ప్రతి తరగతిలో 60 సీట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బాలురకు 30 సీట్లు, బాలికలకు 30 సీట్ల చొప్పున కేటాయించినట్లు వివరించారు.
ఇవేగాకుండా జి.కె.వీధి, డుంబ్రిగుడ(అరకు సంతబయలు), చింతపల్లి, ముంచంగిపుట్టు(పెదబయలు), అనంతగిరి, అరకులోయ, హుకుంపేట(పాడేరు), పెదబయలు, పాడేరు, జి.మాడుగుల, కొయ్యూరులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశాలు కోరుతున్నామన్నారు. 6వ తరగతిలో ప్రవేశాలకు గాను 5వ తరగతి పాసైన విద్యార్థిని, విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు www.aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని ఆయన కోరారు. మే 16వ తేదీలోపు 6,7తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని, మే 21వ తేదీన ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు.