end

TSRTC ఆసుపత్రి నర్సింగ్‌ కాలేజీలో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని తార్నాక తెలంగాణ ఆర్టీసీ ఆసుపత్రిలోని నర్సింగ్‌ కాలేజీలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. ఫిజియోథెరపీ, మహిళా ఎంపీహెచ్‌డబ్య్లూ, ఎంఎల్‌టి తదితర కోర్సుల్లో ప్రవేశాలు జరగనున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 2022-2023 సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో చేరడానికి అర్హులు అని ఆయన వివరించారు. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందవలసిన విద్యార్థులు ఆసుపత్రి అడ్మినిస్ట్రేషేన్‌ సిబ్బందిని సంప్రదించాలని ఆయన కోరారు. 73828 35579, 95736 37594 ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేసి ఫోన్‌ ద్వారా కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

Exit mobile version