end

Harishrao:ఢిల్లీ ఏమ్స్ తర్వాత మన నిమ్స్ లోనే..

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు(Harish Rao)మాట్లాడుతూ …పసి హృదయాలని కాపాడేందుకు, మా ఆహ్వానం మేరకు నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital)కి వచ్చిన బ్రిటన్ వైద్య బృందాని(British medical team)కి ధన్యవాదాలు.డాక్టర్ వెంకట రమణ దన్నపనేని గారు తమ బృందంతో వచ్చి నిలోఫర్, నిమ్స్ వైద్యులకు సహకారం అందించారు. అందరూ కలిసి 9 మంచి చిన్నారులకు సర్జరీలు నిర్వహించారు.ఎక్మో మీద ఉన్న చిన్నారికి కూడా సర్జరీ(Surgery) చేయడం గొప్ప విషయం. అందరికీ అభినందనలు.ఒక్కో సర్జరీని 20 మంది వైద్య బృందం 4-5 గంటల పాటు చేశారు. 9 ప్రాణాలు కాపాడారు.ఈ సందర్భంగా నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్ బీరప్ప గారికి, నిలోఫర్ సూపరింటెండెంట్ ఉషారాణి గారికి, సర్జరీలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు.

పుట్టిన రాష్ట్రంలోని ప్రజలకు సేవ చేయాలని వచ్చిన డాక్టర్ రమణ(Doctor Ramana) గారికి ప్రత్యేక అభినందనలు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు పుట్టిన గడ్డకు మేలు చేయాలని పిలుపు ఇస్తున్నాను.విదేశీ నిపుణులను తీసుకొచ్చి ఇలాంటి క్లిష్టమైన సర్జరీలు చేసిన సందర్భం ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత ప్రభుత్వ నిమ్స్ లోనే జరిగింది.చిన్న పిల్లలకు గుండె సర్జరీ(Heart Surgery) చేయడం అనేది అత్యంత క్లిష్టమైన, ఖరీదైన వైద్యం.దీనికోసం ప్రైవేటులో లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. మన నిమ్స్ లో ఈ 9 మంది చిన్నారులకు పూర్తి ఉచితంగా సర్జరీలు చేయడం జరిగింది.నాకు ఈ రోజు ఎంతో సంతోషంగా అనిపించింది. సర్జరీ తర్వాత ఆ పిల్లలు నవ్వుతుంటే మనసు నిండిపోయింది.తెలంగాణ(Telangana) లో ప్రతి సంవత్సరం 6 లక్షల పిల్లలు పుడుతున్నారు.

వీరిలో 5,400 పిల్లలకు గుండె జబ్బులు ఉంటున్నాయి. వారిలో 1000 మందికి శస్త్ర చికిత్స అవసరంకార్పొరేట్ కి వెళ్ళలేక, సరైన సమయంలో వైద్యం అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.అందుకే, తెలంగాణ ప్రభుత్వం మానవీయకోణంలో అలోచించి వీరికి శస్త్ర చికిత్సల(Surgical Treatments) కొరకు ప్రభుత్వ ఆసుపత్రులలో మౌళిక సదుపాయాలు , సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాము.పెరుగుతున్న అవసరాలకి అనుగుణంగా నిమ్స్ ఆసుప‌త్రిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. మరో వైపు నిమ్స్ విస్తరణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా కొత్త బ్లాక్ ఏర్పాటు చేస్తున్నాం. దీని కోసం కోట్ల విలువైన 32 ఎకరాల ప్రభుత్వ భూమిని నిమ్స్ కి ఇచ్చాము. దీంతో మరో 2000 ప‌డ‌క‌లు అందుబాటులోకి వస్తాయి.నిమ్స్ ఆసుప‌త్రికి ఎంతో మంచి పేరు ఉంది. పెద్ద సంఖ్య‌లో పేషెంట్లు(Patients) వ‌స్తుంటారు. వారంద‌రికి అవ‌స‌ర‌మైన చికిత్స అన్ని వేళ‌లా అందించేందుకు మా నిమ్స్ వైద్య సిబ్బంది, ఇత‌ర సిబ్బంది ఎల్ల‌ప్పుడూ సిద్ధంగా ఉండి అంద్భుత‌మైన సేవ‌లందిస్తున్నారు.

ఒక‌ప్పుడు పెద్ద రోగం వ‌స్తే, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుప‌త్రులు మాత్ర‌మే పెద్ద దిక్కు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. జిల్లా స్థాయిలో పెద్ద రోగాల‌కు చికిత్స అందుతున్న‌ది.ముఖ్యమంత్రి గారు పెరిగిన అవసరాలకు అనుగుణంగా ఉన్న ఆసుపత్రులను ఆధునీకరిస్తూ, మరో వైపు కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు.హైదరాబాద్ భవిష్యత్(Future) అవసరాలు తీర్చేలా…హైదరాబాద్‌ నగరం నలుదిక్కులా సూపర్ స్పెషాల్టీ హస్పిటళ్ల ఏర్పాటు జరుగుతున్నది. ప్రతి హాస్పిటల్‌లో వెయ్యి పడకల(1000 Beds) చొప్పున నాలుగు వేల పడకలతో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్ల(Super Specialty Hospital)ను ఏర్పాటు చేస్తున్నారు.వరంగల్లో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దసరాకు సిద్ధం అవుతుంది. అత్యాధునిక వసతులతో పాటు అంతర్జాతీయ నిపుణులతో నేరుగా మాట్లాడేలా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కూడా అందులో ఉంది.

(Chidanandagiri : ఈ యుగానికి అత్యుత్తమ మార్గం క్రియాయోగం)

తెలంగాణలో ప్రతి లక్ష మందికి 19 ఎంబిబిఎస్(MBBS) సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. 7 పిజి సీట్లతో 2వ స్థానంలో ఉన్నాం.వైద్యులు చికిత్స చేసే సమయంలో పేషంట్ లో తల్లిని, చెల్లిని, కుటుంబ సభ్యులను చూసుకోవాలి. అప్పుడే మెరుగైన సేవలు(Services) అందించగలుగుతాము.

Exit mobile version