end

మళ్ళీ వర్షాలే వర్షాలు

Heavy Rains

 తెలుగు రాష్ట్రాలను మరోసారి వర్షాలు పలకరించనున్నాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం(Bay of Bengal)లో ఇంకో అల్పపీడనం(Low Pressure) ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల మూడురోజులపాటు వర్షాలు కురవనున్నాయి. వచ్చే 24 గంటల్లో అల్పపీడనం వాయవ్య దిశగా ఒడిశా తీరం వైపు వెళ్తుంది. అల్పపీడన ప్రభావంతో ఇంకో 2 రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.

నిన్న సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలపై కూడా అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.  ఉత్తర, ఈశాన్య, తూర్పు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంతే కాకుండ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేసింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో రాబోయే రెండు రోజులు ప్రజలు అప్రమత్తం(Vigilantly)గా ఉండాలని సూచించింది.నిర్మల్, నిజామాబాద్, మెదక్ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వరంగల్ తూర్పు జిల్లాలైన జయశంకర్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, పోలవరం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది..ముఖ్యంగా రాబోయే రెండు రోజుల్లో సాయంత్రం, రాత్రి సమయాల్లోనే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

(రికార్డు స్థాయిలో వర్షపాతం)

Exit mobile version