end

Airtel 5G : అందుబాటులోకి ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు

  • 5జీ సపోర్టుచేసే అన్ని మొబైల్స్‌కు 5జీ సేవలు
  • 4జీ రేట్లకే 5జీ నెట్‌వర్క్‌
  • ఆపిల్‌ ఐఫోన్లకు 5జీ సేవలు ఆలస్యం

Airtel 5G Services : దేశంలో భారతీ ఎయిర్‌టెల్‌(Bharti Airtel) 5జీ సేవలు (5G Network) అందుబాటులోకి రానున్నాయి. ఈ నవంబర్‌ నెల ముగిసేనాటికి దేశంలో అన్ని ప్రాంతాలలో ఎయిర్‌టెల్‌ 5జీ (Airtel 5G) సేవలు ప్రారంభంకానున్నాయని మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఈఓ గోపాల్‌ విఠల్‌ (Gopal Vittal) తెలిపారు. అయితే అన్ని మొబైల్‌ కంపెనీలకు సంబంధించిన 5జీ నెట్‌వర్క్‌ సపోర్టు(5G enabled Mobiles) చేసి అన్ని మొబైల్స్‌కు ఎయిర్‌ టెల్‌ 5జీ సర్వీసులు పని చేస్తాయని పేర్కొన్నారు. కానీ ఆపిల్‌ ఐఫోన్‌లో(Apple iPhones) 5జీ సర్వీసెస్‌ ఐఓఎస్‌ అప్‌డేట్‌ (iOS Update) చేసుకున్న వాటికి మాత్రమే 5జీ సర్వీసులు పొందవచ్చని తెలిపారు. స్యామ్‌సంగ్‌ (Samsung Mobiles), వన్‌ప్లస్‌ (OnePlus Mobiles), రియల్‌మీ(Realme), షవోమీ(Xiaomi), ఒప్పో(OPPO) అన్నీ 5జీ మొబైల్స్‌లలో ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు పొందవచ్చని తెలిపారు.

4జీ(4G) టారిఫ్‌కే 5జీ సేవలు లభ్యమవుతాయని, మున్ముందు 5జీ టారిఫ్‌ రేట్లు పెరగవచ్చని తెలిపారు. నిజానికి ఇప్పటికే 5జీ సేవలు చాలా ప్రాంతాలలో, ముఖ్యమైన నగరాలలో అందుబాటులో ఉన్నప్పటికీ మొబైల్‌ డివైస్‌ను 5జీ సపోర్టు లేక చాలా మంది వినియోగదారులు 5జీ సేవలు ఉపయోగించుకోలేకపోతున్నారని విఠల్‌ వివరించారు. భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియాలో 5జీ సేవల కోసం రూ.23 నుండి రూ.24 వేల కోట్ల వరకు ఖర్చుచేసినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక 4జీ (4G Data) డాటాను 5జీ డాటాగా (5G Data) మార్చుతామని తెలిపారు.

(Twitter Verification : ట్విట్టర్‌ బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ ఇక ప్రీమియం)

Exit mobile version