end

ఎయిర్‌టెల్‌ కస్టమర్లు.. జాగ్రత్త

హైదరాబాద్‌: ఎయిర్‌టెల్‌ కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎయిర్‌టెల్‌ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. కస్టమర్లు తమ kyc ని వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని ఓ లింక్‌తో కూడిన సందేశం పంపుతున్నారని.. కస్టమర్లు ఈ లింక్‌ క్లిక్‌ చేసినట్లైతే డెబిట్, క్రెడిట్‌ కార్డు వివరాలు అడుగుతుందన్నారు. ఆ తర్వాత రూ. 10వేలు చెల్లిస్తే సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని చెబుతుందని, కానీ.. దీంతో మన వివరాలన్నీ సేకరిస్తున్నారని పోలీసులు సూచిస్తున్నారు. ఎయిర్‌టెల్‌ యూజర్స్‌ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని సిటీ పోలీసులు చెబుతున్నారు.

Exit mobile version