end

Alcohol Intolerance :అసహనం పెంచుతున్న ఆల్కహాల్‌..

  • మద్యం సేవించాక వికారం, దురద లక్షణాలు
  • ఫేస్ రెడ్‌నెస్, నాసల్ కంజెషన్, వామిటింగ్
  • జన్యపరంగానూ సంక్రమించనున్న రుగ్మత
  • మోతాదు మించి తాగితే ప్రమాదమే

Alcohol Intolerance : ఈరోజుల్లో ఆల్కహాల్ (Alcohol) లేకుండా జరిగే పార్టీలకు (party) అర్థం లేదు. నిజం (facts) చెప్పాలంటే.. రెగ్యులర్ లైఫ్‌స్టైల్‌లో (regular life style)అదొక భాగమైపోయింది. కానీ మద్యం (wine)సేవించిన తర్వాత వేడి (heat)ఆవిర్లు, వికారం (vomiting)లేదా దురద వంటి లక్షణాలు (symptoms) అనుభవిస్తుంటే మాత్రం అది ఆల్కహాల్‌ అలెర్జీ (allergy)వల్లనే కావచ్చు. అవును.. మీరు విన్నది నిజమే! ఆల్కహాల్ లేదా మరింత శుద్ధ ఇథనాల్‌ (Pure ethanol)కు విషపూరిత ప్రతిచర్యనే ‘ఆల్కహాల్ అలెర్జీ’. ఇది ఇతర అలెర్జీల మాదిరిగానే ఉంటుంది. దీన్నే కొన్నిసార్లు ఆల్కహాల్ సెన్సిటివిటీ (Sensitivity) లేదా ఆల్కహాల్ అసహనంగా సూచిస్తారు. ఇక ఆల్కహాల్ విషపూరితం (toxic) కావడం అనేది ఎప్పుడూ అలెర్జీ వల్ల సంభవించదు. మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా సంభవించవచ్చు. అయితే, ఇలాంటి పరిస్థితులను తట్టుకోలేకపోతే? ముందుగా ఆల్కహాల్ అసహనానికి సంబంధించిన పూర్తి లక్షణాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఆల్కహాల్ అసహనం(Alcohol Intolerance) అంటే శరీరంలోని కొన్ని ఎంజైమ్స్ (Enzymes)ఆల్కహాల్‌ను సరిగ్గా విచ్ఛిన్నం చేయలేకపోవడమే. ఇది మరింత ఎక్కువ ఎసిటాల్డిహైడ్ (Acetaldehyde) ఏర్పడి పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఇది దుష్ప్రభావాలకు (side effects) దారితీస్తుంది. మరి ఆల్కహాల్ అసహనం లక్షణాలను ఏవిధంగా అర్థం చేసుకోవాలో నిపుణులు (experts) వెల్లడించారు.

(Mental Stress: స్ట్రెస్ తగ్గాలంటే ఇలా చేయండి..)

ఆల్కహాల్ అసహనం లక్షణాలు :

ఆల్కహాల్ అసహనం అనేది ఒక జన్యుపరమైన రుగ్మత (Genetic disorder). ఇది వారసత్వం (Inheritance) గానూ సంభవించవచ్చు. ఇందుకు సంబంధించిన నిర్దిష్ట కారణం తెలియనప్పటికీ, దాని లక్షణాలను చూడటం ద్వారా మీరు ఆల్కహాల్ పట్ల అసహనం (impatience)తో ఉన్నారా? లేదా? అని నిర్ధారించవచ్చు. ఒకవేళ ఈ రుగ్మత ఉన్నట్లయితే.. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ సేవించినా ఈ కింది లక్షణాలు అనుభవించే చాన్స్ (chance) ఉందని గుర్తుంచుకోండి.

* ముఖం ఎర్రబడటం

మద్యం సేవించిన వెంటనే మీ ముఖం (face) ఎర్రగా (red)మారవచ్చు. దీనిని ఆల్కహాల్ ఫ్లష్ రియాక్షన్ (flush reaction)అంటారు. ఎక్కడో తీవ్రమైన సందర్భాల్లో ఇది దద్దుర్లు, తక్కువ రక్తపోటు (blood pressure)మొదలైన వాటికి దారితీయొచ్చు. ‘ఆల్డిహైడ్ డీహైడ్రోజినేస్ 2’ (‘Aldehyde dehydrogenases 2’)అనేది ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేయడంలో సాయపడే ఎంజైమ్. ఇది మరింత ఎసిటాల్డిహైడ్ (Acetaldehyde)ఏర్పడటం ద్వారా ముఖం ఎర్రబడటానికి దారితీస్తుంది. ఇది హానికరం కానప్పటికీ అధిక రక్తపోటు వంటి ఇతరత్రా సమస్యలకు దారితీసేందుకు వార్నింగ్ సైన్  (warning science)కావచ్చు.

* ముక్కు రంధ్రాలు బ్లాక్ (Nostrils blocked)

ఆల్కహాల్ అసహనం అనేది జీవక్రియ (curve) రుగ్మత. నాసికా రద్దీ అనేది ఆల్కహాల్ అసహనానికి సంబంధించి అత్యంత సాధారణ లక్షణం (common feature). ఇది తీవ్ర అసౌకర్యానికి కారణమవుతుంది. బీర్(beer), వైన్‌ (wine)లో ముఖ్యంగా హిస్టమిన్ (Histamine)అధిక మొత్తంలో ఉంటుంది. ఇది ముక్కు రంధ్రాలను మరింత మూసుకుపోయేలా చేస్తుంది. దీని నివారణకు ఏకైక మార్గం (only way)ఆల్కహాల్‌ను తగ్గించడం లేదా పూర్తిగా నివారించడమే (Avoidance).

* వికారం, వాంతులు

తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నప్పటికి కూడా కొందరికి వికారంగా అనిపించవచ్చు. ఈ లక్షణం తీవ్రమైన సందర్భాల్లో కొన్ని గంటల నుంచి 48 గంటల (hours) వరకు ఉంటుంది. ఆల్కహాల్.. గ్యాస్ట్రిక్ యాసిడ్ (Gastric acid)ఉత్పత్తిని పెంచుతుంది, ఇది వారికి వాంతయ్యేలా చేస్తుంది.

* డయేరియా(అతిసారం)

ఆల్కహాల్ అసహనంతో బాధపడుతున్న వ్యక్తుల్లో జీర్ణవ్యవస్థ (digestive system)సున్నితంగా (gently) ఉంటుంది. అలాంటివారు మద్యం తీసుకున్నపుడు చికాకు పెరుగుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువ యాసిడ్ ఉత్పత్తికి దారి తీస్తుంది. తద్వారా జీర్ణశయాంతర ప్రేగుల్లో మంట ఏర్పడి విరేచనాలు (Diarrhea) కావచ్చు. ఇది 1 నుంచి 3 రోజుల (days)వరకు ఉంటుంది. ఈ సమయంలో తగినంత నీటిని తీసుకోవడంతో పాటు ఎలక్ట్రోలైట్లను రీఛార్జ్ (Recharge electrolytes) చేయడం ముఖ్యం.

* ఆస్తమా తీవ్రతరం 

ఆల్కహాల్‌లో హిస్టమైన్స్ వంటి సున్నిత పదార్థాలు (Sensitive materials) ఉంటాయి. ఇవి ఆస్తమా (Asthma)తో బాధపడుతున్న వ్యక్తులను ప్రేరేపించగలవు. ఎవరైనా ఆల్కహాల్ అసహనంతో బాధపడుతుంటే వారి శరీరం చాలా సున్నితంగా మారుతుంది. కాబట్టి హిస్టామిన్ విపరీతమైన శ్వాస సమస్యలకు దారి తీస్తుంది. ఇది వారిలో ఆస్తమాను మరింత తీవ్రతరం చేస్తుంది.ఇక ఆల్కహాల్ అసహనం ఎక్కువగా వారసత్వంగా సంక్రమిస్తుంది కాబట్టి దీనికి నిర్దిష్ట నివారణ లేదు. అందుకు ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడం లేదా పూర్తిగా నివారించడమొక్కటే మార్గం.

(Divorce:ఇండియాలో పెరుగుతున్న విడాకులు..)

Exit mobile version