end

Traffic Police:వాహనదారులకు అలెర్ట్

  • రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే వాయింపే
  • భారీగా ఫైన్స్ పెంచేచిన ట్రాఫిక్ పోలీసులు

తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు (Telangana Traffic Police) మరోసారి రూల్స్ (Rules) అతిక్రమించే వాహనదారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలిపారు. రాంగ్ రూట్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ (Wrong route, triple riding, helmet)లేకుండా బండినడపితే భారీ జరిమానాలు (fine) విధించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిబంధనలు పాటించండి ఫ్లీజ్ అంటే ఒక్కరు కూడా మాట వినే పరిస్థితి లేకపోవడంతోనే మరిన్ని కఠినమైన చర్యలు తీసకునేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఇక ఇప్పటికే ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా కించిత్ మార్పు లేదు. డ్రంక్ డ్రైవ్ (Drunk and drive)చేస్తే టెర్రరిస్టులతో సమానం అని చెప్పినా పట్టించుకునే వాడు లేదు. ఎడా పెడా ఇష్టం వచ్చినట్లు వెళ్లిపోవడమే. అందులో భాగంగానే హైదరాబాద్‌లోని ట్రాఫిక్‌ రద్దీని (Hyderabad Traffic Police) నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్ (Operation Rope)చేపట్టారు. అది కాస్తా సక్సెస్ ట్రాక్‌లో వెళ్తుంది. రూల్స్ పాటించని వాహనదారులకు భారిగా పైన్ విధించడంతో అప్రమత్తంగా డ్రైవ్ చేస్తున్నారు. సర్కిల్స్ వద్ద స్టాప్‌ లైన్ (stop line)దాటితే 100 రూపాయలు, ఫ్రీ లెప్ట్‌ (free left) కు బ్లాక్ చేస్తే 1000 వెయ్యి రూపాయలు, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే 600 రూపాయలు ఫుట్‌పాత్‌లను (foot path) ఆక్రమిస్తే భారీ ఫైన్స్ వేస్తూ వాహనదారులను ట్రాక్‌లోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.

(Hyderabad:హైదరాబాద్‌లో గ్లోబల్ రేస్ ఈవెంట్‌)

ఈ మేరకు తాజా రూల్స్‌ను మరింత కఠినతరం చేస్తూ.. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే రూ.1700, ట్రిపుల్ రైడింగ్ (Triple riding)చేస్తే రూ.1200 ఫైన్ వేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి దీనికి ముహూర్తం ఫిక్స్ చేశారు. రూల్స్ పాటించని వాహనాదారులు నిఘా కెమెరాలకు చిక్కినా భారీ ఫైన్స్ తప్పవని పోలీసులు వార్నింగ్ (warning) ఇస్తున్నారు. ట్రాఫిక్‌ రద్దీని కంట్రోల్ చేసేందుకు ప్రతి ఒక్కరు రూల్స్ పాటించాలని, రోడ్లపై  (roads)ఎటువంటి ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించేలా సహకరించాలని పోలీసులు వాహనాదారులను కోరుతున్నారు.

ట్రాఫిక్‌ (Traffic) రద్దీని నియంత్రణకు సరైన పద్దతులు పాటించికపోతే బెంగళూరు (Bangalore)నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు హైదరాబాద్‌ వాసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే కాస్త కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ నిబంధనలు పాటించని వాహనదారుల బెండు తీస్తామని స్పష్టం చేశారు. ఫైన్ విధించడమే కాకుండా తప్పుడు డ్రైవింగ్ చేసేవారి వల్ల పద్ధతిగా ఉండేవారికి ఇబ్బంది పెట్టడం, రాష్ డ్రైవింగ్ చేసిన వదిలిపెట్టమని వివరించారు.

Exit mobile version