end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంవారివన్నీ అడ్డగోలు మాటలు: మంత్రి జగదీష్‌
- Advertisment -

వారివన్నీ అడ్డగోలు మాటలు: మంత్రి జగదీష్‌

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదొర్కొనే దమ్ములేక బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేతల మాటలు రాష్ట్ర ప్రజలకు దురదృష్టం. సీఎంను దేశ ద్రోహి అని దిగజారి మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు.. ఆ మాటకు అర్థం తెలుసా..? అని మంత్రి తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. 150 డివిజన్లలో టీఆర్ఎస్ పోటీ చేస్తోంది ..మాకు ఎవరితో పొత్తు లేదు, తెలంగాణ ప్రజలతోనే మా పొత్తు అని మంత్రి కరాఖండిగా చెప్పారు.

కాంగ్రెస్, బీజేపీలది చీకటి ఒప్పందం అని మంత్రి విమర్శించారు. ఇంతకు ముందు కూడా వారి డ్రామాలు చూశామన్నారు మంత్రి జగదీష్‌. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రతి ఎన్నికలో బీజేపీకి సహకరిస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, దుబ్బాకలో ఒకరికొకరు సహకరించుకున్నారు. వరదల్లో కూడా బురద రాజకీయాలు చేస్తున్నాయి ఈ దొంగ పార్టీలు. వరద సహాయం నిలిపేయాలని బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఈసీకి లేఖ రాశాయి. ఇప్పుడు మేము చెప్పలేదని డ్రామాలాడుతున్నారు. ప్రజల మీద ప్రేముంటే వరద సహాయం అందించాలని మరో లేఖ రాయాల్సిందని మంత్రి సూచించారు.

హైద్రాబాద్ నగర అభివృద్ధి మీద చర్చకు మేము సిద్ధం. గుడి కైనా, బడి కైనా వస్తాం. తిట్లతో ఓట్లు రావన్నారు. కేసీఆర్ ను ఉగ్రవాది, దేశ ద్రోహి అన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రా, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలన్నీ మీవద్దే ఉన్నాయి. ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయలేదు. అసదుద్దీన్ తో మోడీ ఎందుకు సమావేశమయ్యారో బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ఎంఐఎం ఉగ్రవాద సంస్థ అయితే మోడీ ఎందుకు భేటీ అయ్యారు ? దేవుళ్ల పేరుతో ఓట్లు అడుక్కోవడం బీజేపీ కి అలవాటుగా మారిందన్నారు.

ghmc లో వంద సీట్ల కు పైనే గెలుస్తాం. సొంతగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్ ప్రజల గుండెల్లో ఉన్నారు. బండి సంజయ్ తన లేఖ ఫోర్జరీ అయితే పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాలి. కానీ, గుడికి కాదన్నారు. దుబ్బాకలో అప్రమత్తంగా లేకే ఓడామని మంత్రి జగదీష్‌ వివరణ ఇచ్చారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -