end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంబీజేపీవన్నీ తప్పుడు ప్రచారాలు: కేటీఆర్‌
- Advertisment -

బీజేపీవన్నీ తప్పుడు ప్రచారాలు: కేటీఆర్‌

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తుందని తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ మహిళా పక్షపాతి అని మంత్రి కేటీఆర్ కొనియాడారు. టీఆర్ఎస్ గ్రేటర్ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ ఇవాళ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గ్రేటర్ అభివృద్ధి ప్రగతి నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా 150 మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ‘150 డివిజన్లలో 85 డివిజన్లను మహిళలకే కేటాయించామన్నారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించాం. 50 శాతం సీట్లు బీసీలకు కేటాయించాం. టికెట్లు రానివారిని అభ్యర్థులు కలుపుకొని పోవాలని మంత్రి సూచించారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో హైదరాబాద్‌లో కొందరికి అపోహలుండేవి. నగరంలో ఎలాంటి అల్లకల్లోలాలు జరుగుతాయోనని. కానీ, ఈ ఆరేళ్లలో హైదరాబాద్‌లో ఎక్కడా చిన్న గొడవ కూడా జరగలేదు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నారు. ఇది మన అందరి హైదరాబాద్.. ఇది అందరి కోసం పనిచేసే ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పేకాట క్లబ్‌లు లేవు.. గుడుంబా వాసన లేదు. శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయి కాబట్టే, పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఈ ఆరేళ్లలో కేంద్రం హైదరాబాద్‌కు ఏం చేసిందో చెప్పాలి. హైదరాబాద్‌ కోసం చేసిన ఒక్క పనినైనా చూపెట్టే దమ్ము బీజేపీకి ఉందా? అని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. నగరవాసులు అకాల వర్షాలకు ఘోసలు ఎదుర్కొన్నారని, వారికి ప్రభుత్వం సాయం చేస్తే దానిని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. వదర సాయంపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదు’ అని కేటీఆర్ విమర్శించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -