వయసు మీద పడ్డాక మెదడు యవ్వనంలో ఉన్నంత చురుగ్గా (Active) పనిచేయదు. దీంతో జ్ఞాపకశక్తి (Memory) సమస్యలు ఎదురవుతాయి. వృద్ధులను ప్రభావితం చేసే అత్యంత సాధారణ మెదడు సమస్యలలో అల్జీమర్స్ వ్యాధి (Alzheimer’s disease) ఒకటి. కాగా ఈ నాడీ సంబంధిత రుగ్మత.. మెదడు కణాలు చనిపోయి, బ్రెయిన్ (Brain) కుంచించుకుపోవడం వలన కలుగుతుంది. ఈ పరిస్థితిని నివారించేందుకు గల మార్గాలపై అధ్యయనం చేసిన మిలానో- బికోకా విశ్వవిద్యాలయానికి (University of Milano-Bicocca)చెందిన పరిశోధకులు .. ‘బీర్ అల్జీమర్స్ (Beer is Alzheimer’s)ను నివారించడంలో సహాయపడుతుంది’ అని కనుగొన్నారు.
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు సాధారణంగా బీర్ (Beer)లో కనిపించే నాలుగు రకాల హాప్ ఫ్లవర్ ఎక్స్‌ట్రాక్ట్ (Hop flower extract)ల ప్రభావాన్ని పరీక్షించారు, అవి అల్జీమర్స్‌కు కారణమయ్యే మెదడు ప్రోటీన్ క్లంపింగ్ (Protein clumping)ను నిరోధిస్తుందా అని పరిశీలించారు. ఈ క్రమంలో అన్ని బీర్లు హాప్ ఫ్లవర్ ఎక్స్‌ట్రాక్ట్‌లను కలిగి ఉంటాయని, ఇవి శరీర కణాలను రక్షించడానికి భావించే సహజ యాంటీఆక్సిడెంట్ (Antioxidant)లను కలిగి ఉంటాయని గుర్తించారు. మానవ నరాల కణాలు, అమిలాయిడ్ ప్రోటీన్ల (Amyloid proteins)పై పరీక్షించినప్పుడు. ఈ సారం కణాల చుట్టూ అమిలాయిడ్ బీటా ప్రోటీన్లు (Amyloid beta proteins) అతుక్కోకుండా నిరోధించగలదని కనుగొన్నారు. అయినప్పటికీ అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రజలు ఎక్కువ బీర్ తీసుకోవాలని అధ్యయనం సిఫార్సు చేయలేదు.
బీర్ నిజంగా అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందా?
అయితే చాలా సార్లు, వైద్య అధ్యయనాలు వాస్తవ ఫలితాన్ని ప్రతిబింబించని ఫలితాలను కనుగొంటాయి. ఇవి ఆచరణలో చెల్లుబాటు కాకపోవచ్చని అంటున్నారు నిపుణులు. అల్జీమర్స్ వ్యాధి అనేది సంక్లిష్టమైన, ప్రధానమైన మెదడు వ్యాధి. కాబట్టి ఏదైనా ఒక ఔషధం లేదా పదార్థం (ఇక్కడ బీర్) ప్రతి రోగికి విజయవంతంగా సహాయపడే అవకాశం లేదు. అందుకే ప్రాథమిక నివారణ పద్ధతులను ఫాలో కావాలని సూచిస్తున్నారు. ‘ఇది మీ బ్లడ్ షుగర్ (Blood sugar), బరువును అదుపులో ఉంచుతుంది. అదే సమయంలో మెదడు కార్యకలాపాలను పెంచడానికి బ్రెయిన్ (Brain) ను సవాల్ చేస్తుంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం (exercise), ధూమపానం (Smoking)మానేయడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితో అల్జీమర్స్ వ్యాధితోపాటు ఇతర రకాల చిత్తవైకల్యం అభివృద్ధి చెందే అవకాశం గణనీయంగా తగ్గిపోతుందనడానికి గణనీయమైన ఆధారాలు ఉన్నాయి’ అని చెప్తున్నారు.
(Marriages:లగ్గానికి మొగ్గుచూపని నేటి యువతరం)
అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించే జీవనశైలి మార్పులు :
* మద్యం వినియోగాన్ని పరిమితం చేయండి
* ధూమపానం మానుకోండి
* రక్తంలో చక్కెర, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోండి
* క్రమం తప్పకుండా వ్యాయామం
* ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం
* కూరగాయలు, పండ్లు, లీన్ ప్రొటీన్లు, ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉండే ప్రోటీన్ మూలాలు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోండి.
* మెదడును సవాలు చేయడానికి జ్ఞాపకశక్తి నైపుణ్యాలు వంటి అభిజ్ఞా నైపుణ్యాలను ఉపయోగించడం.