end

బెంగాల్‌లో పర్యటించనున్న అమిత్‌షా

నెయ్యితో ఎన్ని లాభాలో..

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చే నెల 5 న బెంగాల్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఆ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ, శుక్రవారం రాత్రి ఉన్నట్లుండి బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంది. స్థానిక పరిస్థితులు, అవసరాల దృష్ట్యా ప్రస్తుత తరుణంలో అమిత్‌షా పర్యటిస్తేనే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గేల్‌ టీ20 బ్రాడ్‌మన్‌: సెహ్వాగ్‌

‘‘ప్రస్తుతానికి జేపీ నడ్డా పర్యటన వాయిదా పడింది. నవంబర్ 5 నుంచి రెండు రోజుల పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బెంగాల్ పర్యటనకు రానున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయంతన్ బసు ప్రకటించారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా కార్యక్షేత్రంలో పార్టీ పరిస్థితి, పార్టీ నిర్మాణం.. తదితర అంశాలపై షా సుదీర్ఘ భేటీ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కేంద్రమిచ్చిందెంత..

అత్యంత కీలకమైన మేధినీపూర్ లో షా తొలి రోజు పర్యటిస్తారని, కీలక నేతలతో సమావేశం నిర్వహిస్తారని పార్టీ పేర్కొంది. అయితే రెండో పర్యటన వివరాలపై తుది నిర్ణయం తీసుకోలేదని నేతలు తెలిపారు. ఈ పర్యటనలో షా పూర్తిగా ‘బూత్ సంఘటన’ పై దృష్టి సారిస్తారని, కార్యక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపైనే చర్చ ఉంటుందని ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ ప్రకటించారు.

దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురబోతోంది: రాజాసింగ్‌

Exit mobile version