end

Amma’s prophecy:అమ్మవారి భవిష్యవాణి ….

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం(Ujjaini Mahankali Temple)లో తనకు పూజలు సక్రమంగా నిర్వహించడం లేదని పట్టిచ్చుకోవడం లేదని అమ్మవారు భవిష్యవాణిలో పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఇష్టం వచ్చినట్లు తన రూపాన్ని మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లష్కర్ బోనాల జాతరలో రెండో రోజైన సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి భక్తురాలైన స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయంలో పూజలు సక్రమంగా జరగడం లేదు. మీ సంతోషం కోసం పూజలు చేస్తున్నారే తప్ప నాకోసం కాదు. మీరు చేసే తప్పులన్నీ కడుపులోనే దాచుకుంటున్నాను. నా గర్భగుడిలో పూజలు శాస్త్రోస్తకంగా(Scientifically) పూజలు చేయండి. మీరు ఎన్ని తప్పులు చేస్తున్నా నా బిడ్డలే కదాని క్షమించి భరిస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినట్లు నా రూపాన్ని మార్చేస్తున్నారు. నావన్నీ కాజేస్తున్నారు. నాకు శాశ్వతరూపం కల్పించండి. భక్తులు నన్ను కనులారా దర్శించుకునేలా(Visit) ఏర్పాట్లు చేయండి. మీరంతా నా పట్ల చేసే తప్పుల విషయంలో నా ఆగ్రహాన్ని వర్షాల రూపంలో చూపించాను. ఆగ్రహంతోనే భారీవర్షాలు(Heavy Rains) కురిపించాను. నా గురించి మీకు తెలియాలనే ఇలా చేశా అని అమ్మవారు స్పష్టం చేశారు.

(Budh Pradosh Vrat:బుధ ప్రదోష వ్రతం)

Exit mobile version