- జనసేన అధినేత పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి నగరమే ఏకైక రాజధానిగా ఉండాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. 5 నియోజకవర్గాల పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్.. అధికారం అంతిమలక్ష్యం రూ. వేల కోట్లు సంపాదించడం కాదన్నారు. పాలకులు పరిస్థితులకు తగ్గట్లుగా మాట మారుస్తారు. అమరావతి విషయంలో అదే జరిగిందన్నారు పవన్. టీడీపీ హయాంలో విపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీ అమరావతి రాజధానికి మద్దతిచ్చింది. కానీ, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక.. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధానులను 3కు పెంచడం లాంటి పనులు చేస్తుందన్నారు. రాజధాని వస్తుందని ప్రజలు తమకు తాముగా తమ భూమిని సమర్పించారు. ఇప్పుడు రైతులను మోసం చేస్తూ.. తాత్సారం చేస్తోంది జగన్ ప్రభుత్వమని పవన్ విమర్శించారు.
ఏదైనా సమస్యపై గళం విప్పితే.. వ్యక్తిగత విమర్శలు, కుటుంబ విషయాలు తీసుకురావడం వారికి పరిపాటిగా మారిందని పవన్ ఆరోపించారు. దూషించడం పక్కన పెట్టి.. సమస్యను పరిష్కరిద్దామన్న ఆలోచనా ధోరణి అధికార పక్షానికి లేదని జనసేనాని.. వైసీపీని ఎద్దేవా చేశారు.