end

ఇక ‘అనంత’ ఆలయాన్ని దర్శించుకోవచ్చు

  • తెరుచుకున్న అనంత పద్మనాభస్వామి ఆలయం

దేశంలో కరోనా వైరస్‌ వల్ల మార్చిలో లాక్‌డౌన్‌ విధించిన తర్వాత దాదాపు అన్ని ఆలయాలు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా అన్‌లాక్‌ ప్రక్రియ నడుస్తుండడంతో తిరువనంతపురంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని బుధవారం నుండి భక్తుల కోసం తెరుస్తున్నట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.

కొమురవెళ్లి గుడి మూసివేత

ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు, మళ్లీ ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి దీపారాధన సమయం వరకు ఆలయాన్ని తెరిచిఉంచనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆలయానికి వచ్చే భక్తులు కచ్చితంగా కోవిడ్‌ నిబంధనలు పాటించాల్సి ఉంది. భక్తులు తప్పకుండా ముఖానికి మాస్క్‌ ధరించాలి. శానిటైజేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలి. భక్తులు దూరం పాటించి దైవ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

చాణక్య నీతులు – రహస్యాలు

Exit mobile version