end

రంగమ్మత్త చాలా బిజీ…

ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. ఇప్పుడు సినిమాల్లోనూ కీల‌క పాత్రల్లోనూ నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఒక కార్యక్రమాన్ని హోస్ట్ చేయడంలో స్పెషల్ అనిపించుకుంది అనసూయ. పేరుకు యాంకరే అయినా కెమెరా కళ్లన్నీ తనవైపే ఉండేలా చూసుకోవడం అమ్మడి నైజం.అందం విషయంలో, అలాగే అట్రాక్ట్ చేసే విషయంలో తగ్గేదే లే.. అన్నట్లుగా దూసుకుపోతుంది. బుల్లితెరతో పాటు వెండితెరపై అవకాశాలు దకించుకుంటూ తెగ హంగామా చేస్తోంది అనసూయ. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి తన టాలెంట్ చూపించింది ఈ అమ్మడు.

వెండితెరపై రంగస్థలం సినిమా అనసూయ కెరీర్‌ను మలుపుతిప్పింది. దీంతో ఒకవైపు రెగ్యులర్‌గా రియాలిటీ షోలతో బిజీగా ఉంటూనే మరోవైపు వెండితెరపై నటిగా వరుస ఆఫర్స్ ని అందిపుచ్చుకుటుంది అనసూయ భరద్వాజ్.పుష్ప సినిమాలో దాక్షాయణిగా అదరగొట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఈ సీక్వల్ గా పుష్ప 2 రానున్న సంగతి తెలిసిందే. ఇందులో అనసూయ రోల్ మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుంది. ఇకపోతే ఈ బిజీ షెడ్యూల్ నడుమ ఏ మాత్రం సమయం దొరికినా తన భర్త, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తుంటుంది అనసూయ. ఈ క్రమంలోనే అనసూయ ఫ్యామిలీ ఫొటోస్ వైరల్ అవుతుంటాయి.

Exit mobile version