AP Assembly : ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ్ ఎన్నికల్లో టీడీపీ అధిక్యంలో కొనసాగుతుంది. వైఎస్ఆర్ సీపీకి అడ్డాగా ఉన్న రాయలసీమ వెనుకంజలో ఉంది. (Ap assembly) చిత్తురు జిల్లాలో పుంగునూరు మినహా అన్ని స్థానంలో టీడీపీలో అధిక్యంలో ఉంది. టీడీపీ పార్టీ 127 స్థానల్లో కొనసాగుతుండగా వైఎస్ఆర్ సీపీ 23 స్థానాలు పరిమితం అయింది.
ఓవరల్గా టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతుందనే చెప్పవచ్చు. కడప జిల్లాలో టీడీపీ ముందంజలో ఉండటం ఆసక్తిని కలిగిస్తుంది. (TDP) కడప, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగులో టీడీపీ ముందంజలో ఉండగా బద్వేలులో వైసిపీ అభ్యర్థి 1483 ఓట్లతో ముందంజలో ఉన్నాడు. పులివెందులలో అంటే ఏపీ సీఎం జగన్ అడ్డాలో పెద్ద ఎత్తున ఆయన ఆధిక్యాన్ని ఏమీ చాటక పోవడం గమనార్హం.
రెండు రౌండ్లు ముగిసే సమయానికి జగన్ రెడ్డి కేవలం 1888 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి 471 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. కడపలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి 3069 ఓట్ల అధిక్యంలో ఉన్నారు.