దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. డిల్లీ వసంత్ విహార్ లో దారుణమైన సంఘటన జరిగింది. పదో తరగతి చదువుతున్నా విద్యార్థిని ని లాంగ్ డ్రైవ్ కి తీసుకొని వెళ్తాం అని నమ్మించి ముగ్గురు యువకులు కారు కదులుతున్న సమయం లోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జులై 6న ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు తెలిపింది. అత్యాచారానికి సంబంధించిన సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. జులై రాత్రి 8.30 గంటల సమయంలో ముగ్గురు నిందితులు తమ కారులో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోంది.