- కుమారుడు అగ్నిప్రమాదం నుంచి బయటపడినందుకు అన్నదానం
- స్వయంగా భక్తులకు అన్నం వడ్డించిన దాత
టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్‌కు ఏపీ సీఎం పవన్‌కల్యాణ్(Pawan kalyan) సతీమణీ(Wife) అన్నా లెజినోవా(Anna Leginova) తమ కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) పేరిట సోమవారం రూ.17 లక్షల భూరి విరాళమిచ్చారు. అందుకు సంబంధించిన చెక్కులను టీటీడీ అధికారులకు అందజేశారు. అనంతరం ఆమె స్వయంగా భక్తులకు దగ్గరుండి అన్న ప్రసాదాలు వడ్డించారు. అంతకముందు ఆమె శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వేదపండితులు, అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు. పవన్‌కల్యాణ్, అన్నా లెజినోవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో అగ్నిప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. మార్క్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినందుకు గాను అన్నా లెజినోవా శ్రీవారి చెంతకు వచ్చి మొక్కు తీర్చుకున్నారు. పద్మావతి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి స్వామివారి పట్ల తన భక్తిప్రపత్తులను చాటుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆమె అన్యమతస్థురాలిగా రికార్డుల్లో సంతకం చేశారు.