నిత్యం నేరాలు, ఘోరాలు చోటుచేసుకునే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. 17 ఏళ్ల మైనర్ బాలికపై హత్యాచారం జరిగింది. అమ్మాయి బాయ్‌ఫ్రెండ్, అతడి స్నేహితుడు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వివరాలు చూసినట్లైతే.. బరాబంకి జిల్లాలోని నాలాలో ఓ బాలిక మృతదేహం కనిపించడంతో స్థానికులు.. పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. హత్యాచారానికి గురైన బాలికకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని గుర్తించిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అమ్మాయి కుటుంబసభ్యులు తమ బంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో ఆమె తనను కలవట్లేదని, అందుకే అదును చూసి.. అమ్మాయిని రప్పించి, తన స్నేహితుడితో కలిసి రేప్ చేసి చంపినట్లు అంగీకరించాడు.