end

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

  • కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో భారీ వర్ష సూచన
  • మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక

ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ లో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 25 నుండి క్రమేణా వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Exit mobile version