end

Greater Hyderabad:మరో ఫ్లై ఓవర్ బ్రిడ్జి సిద్ధం చేసిన జీఎచ్‌ఎంసీ

  • మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం


గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) నుంచి నగర వాసులకు గుడ్ న్యూస్ వచ్చింది. నగరంలో మరో ఫ్లై ఓవర్ (Fly over)అందుబాటులోకి రాబోతుంది. శిల్పా లే ఔట్ (Shilpa lay out) ఫ్లైఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర మునిసిపల్ పట్టణాభివృద్ధి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(Kalvakuntla Taraka Rama Rao) శుక్రవారం ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా వాహనాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తున్నది. ప్రజల అవసరాలను ముందుగా అంచనా వేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ముఖ్యంగా రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్ ఫ్రీ(Signal is free) రవాణా వ్యవస్థను మెరుగు పరిచి వాహనదారులు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి సకాలంలో చేరడం కోసం స్ట్రాటజిక్ రోడ్ (Strategic Road)డెవలప్మెంట్ (SRDP) ప్రోగ్రామ్ ద్వారా చేపట్టిన పలు పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి రావడం మూలంగా ప్రజల ఇబ్బందులు తొలగిపోతున్నాయి.

రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి (State Minister for Municipal, IT and Industries) కె.టి.ఆర్ ముందుచూపుతో గ్రేటర్ హైదరాబాద్ ను విశ్వ నగరంగా అభివృద్ధి చేసి మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఐటీ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్(Real estate) రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్ లో గచ్చిబౌలి, మాదాపూర్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో గణనీయమైన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత రవాణా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు ఎస్.ఆర్.డి.పి ద్వారా కారిడార్లు(Corridors), అండర్ పాస్‌లు(Underpasses), ఆర్ఓబిలు(ROBs) లాంటి రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ముందకు వెళ్తున్నారు.

(Cricket:రేపే తొలి వన్డే)

అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్(Financial District) వరకు ఔటర్ రింగు రోడ్డు (Outer Ring Road) ద్వారా గచ్చిబౌలి (Gachibowli) వరకు ఎలాంటి సమస్యలు లేకుండా నేరుగా చేరుకున్నప్పటికీ అక్కడ నుండి ఇతర ప్రాంతాలకు సులభతరంగా వెళ్లేందుకు ముఖ్యంగా శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం వలన ట్రాఫిక్ (traffic) కు అంతరాయం లేకుండా వెళ్లేందుకు సులభతరం అవుతుంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట నుండి గచ్చిబౌలి మీదుగా పఠాన్ చేరు, కోకాపేట్, నార్సింగ్ (From Jubilee Hills, Panjagutta via Gachibowli to Pathan Cheru, Kokapet, Narsingh) తో పాటుగా అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) వెళ్లేందుకు సులభతరం అవుతుంది.

ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 17వ ఫ్లైఓవర్ బ్రిడ్జి
ఓ.ఆర్.ఆర్ నుండి గతంలో ఉన్న గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై నుండి శిల్పా లే ఔట్ వరకు అక్కడ నుండి ఓ.ఆర్.ఆర్ వరకు మరో వైపు రెండు వైపులా కలుపుకుని మొత్తం 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పు గల ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు. అప్ ర్యాంపు ఓ.ఆర్.ఆర్ నుండి శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ వరకు 456.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్ నుండి ఓ.ఆర్.ఆర్ వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 399.952 మీటర్ల వెడల్పుతో రెండు ఫ్లైఓవర్ లను చేపట్టారు. సర్వీస్ రోడ్డు (Service Road)గా ఉపయోగించేబడే గచ్చిబౌలి నుండి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లైఓవర్ ను చేపట్టారు. అదే విధంగా మైండ్ స్పేస్ నుండి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ (Down ramp fly over) 522 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో చేపట్టారు.

ఈ శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వలన ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, హై టెక్ సిటీ (Finance District, Hi Tech City)మధ్య రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ కు సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. హెచ్.కె.సి, మీనాక్షి టవర్ (HKC, Meenakshi Tower) ప్రాంతంలో అభివృద్ధి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు స్టేజి 2లో భాగంగా ఓ.ఆర్.ఆర్ నుండి కొండాపూర్ (Kondapur) వరకు చేపట్టే ఫ్లై ఓవర్ పనులు కొనసాగుతున్నాయి.

Exit mobile version