- ఒక్క ఇన్నింగ్స్‌తో మారిపోయిన ఐసీసీ ర్యాంకింగ్స్
- టీ20 టాప్ 10 జాబితాలో చేరినపోయిన మాజీ సారథి
ప్రస్తుతం ఆస్ట్రేలియా (Australia)వేదికగా జరుగుతున్న ఐసీసీ (ICC) టీ20 (T20) ప్రపంచకప్‌లో(World cup) భారత్ -పాకిస్థాన్ (ind vs pak) మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (virat kohli)తుఫాన్ ఇన్నింగ్స్ (innings) ఆడిన సంగతి తెలిసిందే. కాగా ఈ కీలక ఇన్నింగ్స్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్(rankings)అన్నీ తలకిందులయ్యాయి. తన కెరీర్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకోచ్చాడు.
తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఈ కుడిచేతి వాటం మాజీ సారథి టాప్-10లోకి (Top 10)చేరాడు. దీంతో తన అభిమానులకు కూడా ఓ గుడ్ న్యూస్ (good news)అందినట్లైంది. అది కూడా కేవలం మూడు నెలల్లోనే (3 months)కీలక మార్పులు రావడంతో.. ఇప్పుడంతా కాలర్ ఎగరేస్తున్నారు. పాకిస్థాన్‌పై కోహ్లి అజేయంగా 82 పరుగులు (runs)చేయడంతో తొమ్మిదో నంబర్‌కి (9 number)దూసుకొచ్చాడు. ఆదివారం (sunday)మెల్‌బోర్న్‌లో (melbourne)పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ 635 పాయింట్లతో (points)టీ20 ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి చేరుకోవడంతో.. మరోసారి తన పూర్వ వైభావాన్ని ప్రదర్శించాడు. కాగా, సూర్యకుమార్ యాదవ్ (surya kumar yadav)ఒక స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం రెండో స్థానం నుంచి మూడో స్థానానికి (3rd place)చేరుకున్నాడు.
(Cricket:కోహ్లీని ఎత్తుకున్న రోహిత్..)
గత మూడేళ్లుగా (3 years)కోహ్లీ చాలా కష్టాలు పడుతున్నాడు. అతని బ్యాట్ నుంచి ఒక్క సెంచరీ (century)రాలేదు. కానీ, ఆసియా కప్-2022లో, (Asia cup)కోహ్లి తన ఫామ్‌కు తిరిగి వచ్చాడు. అతను మరోసారి తన పాత శైలిలో కనిపించాడు. ఇది మూడు నెలల క్రితం నాటి మాట. ఆ సమయంలో ఆసియా కప్ ప్రారంభం కానుండడంతో విరాట్ ర్యాంకింగ్ 35వ స్థానంలో ఉంది. దీంతో కింగ్ కోహ్లి ఆఫ్ఘనిస్థాన్‌పై (Afghanistan)సెంచరీ చేసి 15వ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పుడు టాప్ 10లోకి చేరాడు. 2019 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో (international cricket) విరాట్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. దీని తర్వాత ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై ఓవరాల్‌గా 71వ సెంచరీని నమోదు చేశాడు.
ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. కోహ్లి 82 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది. హార్దిక్‌తో (hardik)కలిసి 113 పరుగుల భాగస్వామ్యం (partnership)నెలకొల్పాడు. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు కావాల్సిన సమయంలో నోబాల్‌లో ( no ball)సిక్సర్ (six)బాది జట్టుకు విజయ మార్గాన్ని చూపించాడు కోహ్లి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా (player of the match)కోహ్లీ ఎంపికయ్యాడు.
విరాట్ ఈ ఇన్నింగ్స్ చరిత్రాత్మకంగా నిలిచింది. కేఎల్ రాహుల్, (rahul)రోహిత్ శర్మ, (rohith)సూర్యకుమార్ (surya) యాదవ్, అక్షర్ పటేల్ (Axar patel)), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (dinesh karthik), రవిచంద్రన్ అశ్విన్ (ravichandran ashwin)అంతా కలిసి 67 పరుగులు (runs) మాత్రమే చేయగలిగారు. మరోవైపు విరాట్ బ్యాటింగ్‌లోనే 82 పరుగులు చేశాడు. మరీ ముఖ్యంగా ఓటమి అంచుకు చేరిన జట్టుకు విజయం అందించాడు.
పాకిస్థాన్ కెప్టెన్ (captain)బాబర్ ఆజం (babar azam) భారత్‌పై గోల్డెన్ డక్‌కి (golden duck)గురయ్యాడు. ర్యాంకింగ్స్‌లో కూడా దీని భారాన్ని చవిచూడాల్సి వచ్చింది. బాబర్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయాడు. టాప్-10లో ఉన్న ఇద్దరు భారత బ్యాట్స్‌మెన్‌లలో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నారు.ఇదిలావుంటే.. బౌలింగ్ (bowling)విభాగంలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌నకు ముందు భువనేశ్వర్ కుమార్ (bhuvneshwar kumar)బౌలింగ్ గురించి చాలా ప్రశ్నలు తలెత్తాయి. అయితే తాజా మ్యాచ్‌లో ఈ సీనియర్ భారత బౌలర్ విమర్శకులకు ఘాటుగా సమాధానమిచ్చాడు.
ICC ప్రపంచ కప్-2022లో భారత జట్టు అద్భుతంగా ఆరంభించింది. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించింది. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ (netherlands)జట్టును కూడా మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు చెందిన ఈ సీనియర్ బౌలర్ అద్భుతంగా రాణించాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి ఓవర్, మూడో ఓవర్‌ను భువనేశ్వర్ మెయిడిన్‌గా (Maiden)వేశాడు. భువీ తన రెండో ఓవర్ రెండో బంతికి వికెట్ (wicket)కూడా తీశాడు. తొలి రెండు ఓవర్ల లెక్కలు ఓసారి చూద్దాం.. 0,0,0,0,0,0,0,W,0,0,0,0గా సంధించాడు. దీంతో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లలో మెయిడిన్లు వేసిన సెలెక్ట్ బౌలర్లలో భువనేశ్వర్ పేరు రాసిపెట్టుకున్నాడు.
భువనేశ్వర్ కంటే ముందు, 2012 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఇంగ్లండ్ (england)ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ (graeme swan) ఈ లిస్టులో నిలిచాడు. అతని తర్వాత 2014 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై శ్రీలంకకు (sri lanka)చెందిన నువాన్ కులశేఖర (kulasekhara), న్యూజిలాండ్‌పై (new zealand)రంగనా హెరాత్ (rangana herath)ఓపెనింగ్ రెండు మెయిడిన్‌లను బౌల్డ్ చేశాడు. ఈ ముగ్గురి తర్వాత భువనేశ్వర్ ఈ లిస్టులో చేరాడు. మరోవైపు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల విషయానికి వస్తే.. భువనేశ్వర్ రెండోసారి భారత్ తరపున ఈ పని చేశాడు. అంతకుముందు మిర్పూర్‌లో జరిగిన 2016 ఆసియాకప్‌లో యూఏఈ (UAE)పై ఈ ఘనత సాధించాడు.
(Cricket:ఈ ప్రపంచకప్‌లో బద్దలయ్యే 10 రికార్డులు..)
2012లో కొలంబోలో (Colombo) ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్స్‌లో (internationals)భవనేశ్వర్ కంటే ముందు, హర్భజన్ సింగ్ (harbhajan sing)రెండు ఓవర్లలో మెయిడిన్లు బౌలింగ్ చేశాడు. హర్భజన్ తర్వాత, మిర్పూర్‌లో పాకిస్థాన్‌పై జస్ప్రీత్ బుమ్రా (jasprit bumrah)రెండు ఓవర్లలో మెయిడిన్ బౌలింగ్ చేశాడు.టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా (india)వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో పాక్ (pak)జట్టును చిత్తు చేసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ (netherlands)టీంను కూడా భారీ తేడాతో ఓడించింది. టీమిండియా 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించి, గ్రూప్ 2లో (Group 2)అగ్రస్థానం చేరింది. విరాట్ 44 బంతుల్లో 62, సూర్య 25 బంతుల్లో 51, రోహిత్ 39 బంతుల్లో 53 పరుగులు చేశారు.