end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంRain Alert:ఈనెల 9న మరో అల్పపీడనం..
- Advertisment -

Rain Alert:ఈనెల 9న మరో అల్పపీడనం..

- Advertisment -
- Advertisment -

ఈ యేడాది తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని దాదాపుగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారిపోగా.. కొన్నిచోట్ల చెరువులు మత్తెడ దుంకుతున్నాయి. మరికొన్నిచోట్ల వాగులు, వంకలు తెగి పొంగిపొర్లుతున్నాయి. అయితే మరో వారంలో వర్షకాల సీజన్ ముగియనున్నప్పటికీ ఎడతెరిపిలేని వానలు జనసమూహాలను అతలాకుతలం చేస్తుండగా మరోసారి షాకింగ్ న్యూస్ చెప్పింది వాతవరణశాఖ(Department of Meteorology). ఈ మేరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో కొన్ని రోజులుగా ఏపీలో వాతావరణం సమ్మర్‌ను తలపిస్తోంది. కాగా ఈ ప్రభావంతో క్యుములోనింబస్‌(Cumulonimbus) మేఘాలు ఆవరించాయని, ఈ కారణంగా భారీ వర్షాలు పడే చాన్స్ ఉన్నట్లు వెల్లడించింది.

(Sushmita :పీరియడ్స్ గురించి మాట్లాడటానికి సిగ్గెందుకు..)

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌‌లోని కోస్తా, రాయలసీమ(Rayalaseema)లోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో గత రెండు రోజులుగా కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నాయి.  ఈ క్రమంలో మరో రెండు రోజులు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలతో పాటు ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక జారీచేసింది. ఈనెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు మధ్య మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం(Bay of bengal)లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయి. ఈ ప్రభావంతో అక్టోబర్ 5-6 తేదిల్లో కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.  కోస్తాంధ్రాలోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 9వ తేదీన ఏర్పడే అల్పపీడనం శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలో రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అల్పపీడన ప్రభావం నాలుగు రోజులు ఉంటుందని.. ఈ సమయంలో తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పండగల సందర్భంగా యువత, మహిళలు సముద్ర స్నానాలకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా పలు చోట్ల బుధ, గురు వారాల్లో తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని హెచ్చరించారు.

అల్పపీడనం ప్రభావంతో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని మత్స్యకారులు(Fishermen) వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ వాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా క్షేత్రస్థాయి అధికారులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరం అయితే పునరావస కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ నెలలో కోస్తా, రాయల సీమల్లో ఉరుములు, పిడుగుల(Thunderbolts)తో వర్షాలు కురిశాయి. రాబోయే రోజుల్లో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడనున్నాయి. రాష్ట్రంలో సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండగా ఈ మూడు రోజులు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు టెంపరేటర్ ఎక్కువగా నమోదవడం విశేషం. కాగా ఈ వర్షాలు కురవడం వల్ల వాతావరణం చల్లబడి ప్రజలకు కాస్త ఉపశమనం పొందుతున్నారు.

(Dragons:భూమిపైకి మళ్లీ ‘డ్రాగన్స్’ రాబోతున్నాయా?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -